వాస్తవ సంఘటనల ఆధారంగా చిరు152 కథ?

0

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే లాంచ్ చేసిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. కొరటాల మొదటిసారిగా మెగాస్టార్ తో పనిచేస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకూ కొరటాల దర్శకత్వం వహించిన సినిమలన్నీ సూపర్ హిట్లే.. అన్నిటిలో ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఒక పవర్ ఫుల్ మెసేజ్ ఉంటుందని.. దాంతో పాటుగా మెగాస్టార్ ఫ్యాన్స్ ఆశించే కమర్షియల్ అంశాలు కూడా ఉంటాయని అందరూ ఫిక్స్ అయ్యారు.

ఇక ఈ సినిమా కథ ఎలా ఉండబోతోందనే విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కథను వాస్తవ సంఘటనల ఆధారంగా కొరటాల తీర్చిదిద్ధారట. సింహాచలం వరహా నరసింహ స్వామి దేవాలయ భూములను గతంలో కొందరు కాజేశారు. ఈ విషయంలో ఎంతో రాద్ధాంతం జరిగింది. ఇలా గుడికి సంబంధించిన భూముల కబ్జానే కొరటాల ఈ ఈ సినిమాకు ప్రధాన ఇతివృత్తంగా కొరటాల ఎంచుకున్నారట. గుడిమాన్యాలను కాజేసే అక్రమార్కుల భరతం పట్టే వ్యక్తి పాత్రలో చిరు నటిస్తున్నారట. ఈ సినిమాలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో పని చేసే ఉద్యోగిగా చిరు కనిపిస్తారని కూడా అంటున్నారు.

సినిమా బేసిక్ థీమ్ అయితే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. ఈ సినిమాకు కొరటాల మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్.. రఫ్ఫాడించే చిరు హీరోయిజం కనుక తోడైతే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడం ఖాయమేననుకోవచ్చు.
Please Read Disclaimer