రీమేక్ జోలికి వెళ్లకపోవడానికి రీజన్

0

ఏదైనా సినిమా చర్చల దశలో ఉండగానే వంద రకాలు రూమర్లు స్ప్రెడ్ అవుతుంటాయి. అదీ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ తరహా ప్రచారం మరీ ఎక్కువైంది. చిన్న పాయింట్ లీకైనా ఉతికి ఆరేస్తున్నారు. ఫలానా సినిమాకి రీమేక్ చేయాలనుకుంటున్నారని లేదా లైన్ తీసుకుని వేరేగా తీస్తున్నారని ఇలా రకరకాలుగా ప్రచారం సాగిస్తున్నారు. అదీ త్రివిక్రమ్ సినిమాల విషయంలో ఆ తరహా ప్రచారం మరీ టూమచ్ గానే సాగుతోంది. త్రివిక్రమ్ ప్రతి సినిమాకి ఏదో ఒక కామెంట్ తప్పనిసరి.

తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తెరకెక్కించిన `అల వైకుంఠపురములో` చిత్రం కూడా బాలీవుడ్ సినిమా నుంచి స్ఫూర్తి పొంది తీస్తోందని ఇంతకుముందు ఓ రూమర్ వినిపించింది. బాలీవుడ్ లో వంద కోట్ల వసూళ్లు సాధించిన `సోను కీ టిటులీ కీ స్వీటీ`ని రీమేక్ చేస్తున్నారని ప్రచారం వెడెక్కించిన సంగతి తెలిసిందే. బన్ని రకరకాల డైలమాల్లో ఉన్న ఆ సన్నివేశంలో ఒరిజినల్ స్క్రిప్టు కంటే రీమేక్ స్క్రిప్టు బెటర్ అని భావిస్తున్నారని అందుకే బాలీవుడ్ రీమేక్ ని ప్లాన్ చేశారని ఫిలిం సర్కిల్స్ లో వాడి వేడి చర్చ సాగింది. తర్వాత ఆ చర్చ రొటీన్ అయిపోవడంతో జనాలు మర్చిపోయారు. తాజాగా ఈ రూమర్ పై బన్నీ ఓ ఇంటర్వూలో వివరణ ఇచ్చాడు.

ఆ బాలీవుడ్ సినిమాను గీతా ఆర్స్ట్ లో రీమేక్ చేద్దామని అడిగారు. చాలా మంది అది నా కోసమే అనుకున్నారు. నేను కూడా దానిపై ఆలోచించాను. అదే సమయంలో త్రివిక్రమ్ నేను సోను కి టిటులీ గురించి అనుకున్నాం. అలాగే మరో స్టారీ కూడా చర్చలోకి వచ్చింది. రీమేక్ స్టోరి కంటే ఇద్దరం డిస్కస్ చేసుకున్న స్క్రిప్ట్ అయితేనే సేఫ్ గా ఉంటుందని భావించాను. అందుకే `సోను కే టిటు కీ స్వీటీ` జోలికి వెళ్లలేదు. ఆ సినిమా రిస్క్ అనిపించింది. అల వైకుంఠపురములో కాన్సెప్టులో కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఉంది..సేఫ్ ప్రాజెక్ట్ లా అనిపించింది అని బన్ని తెలిపాడు. మొత్తానికి రీమేక్ ఆలోచన బన్నిని బయపెట్టిందనే దీనిని బట్టి అర్థమవుతోంది.
Please Read Disclaimer