భీష్మ పోస్ట్ పోన్ రీజన్ అదే !

0

టాలీవుడ్ లో ఇప్పుడు రిలీజ్ డేట్స్ మార్పులు అనేది సర్వ సాధారణం అయిపోయింది. కొందరు ప్రారంభం రోజే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఆ తరవాత కంటెంట్ రెడీ కాక మళ్లీ పోస్ట్ పోన్ చేసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే తాజాగా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయిన లిస్టులోకి నితిన్ భీష్మ కూడా చేరింది.

షూటింగ్ ఇంకా మిగిలి ఉండగానే కంగారు పడి డిసెంబర్ లో క్రిస్మస్ కి రిలీజ్ అంటూ అనౌన్స్ చేశారు. అయితే ఆ తర్వాత ఇంకా షూటింగ్ పూర్తి కారణంగా ఫిబ్రవరి కి పోస్ట్ పోన్ అనే సంకేతాలు వదిలారు. అయితే వెంకీ కుడుములకి ఫిబ్రవరి సెంటిమెంట్ కూడా ఉండటంతో పైగా షూటింగ్ కూడా మిగిలి ఉండటంతో ఎట్టకేలకు ఫిబ్రవరికి రిలీజ్ ను పోస్ట్ పోనే చేశారు.

నిజానికి ఒకే ఒక్క నెలలో టోటల్ షూటింగ్ పూర్తి చేయడం పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేయడం ప్రమోషన్స్ చేయడం మేకర్స్ కి చాలా టప్ అందుకే కామ్ గా డిసెంబర్ పోటీ నుండి తప్పుకున్నారు. సో ఈ లెక్కన చూస్తే నితిన్ నుండి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రానట్టే. మరి వచ్చే ఏడాది అయిన రెండు సినిమాలతో ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా ఇస్తాడేమో చూడాలి.
Please Read Disclaimer