బ్రదర్ కోసమేనా చైతూ?

0

అక్కినేని నాగచైతన్య – సమంత జంట సింగపూర్ లో వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీరితో పాటుగా చైతూ మదర్ లక్ష్మిగారు.. మరో ముగ్గురు అతిధులు కూడా కనిపిస్తున్నారు. అయితే ఆ అతిధులు ఎవరు? అంటే వీళ్లు బయటి ప్రపంచానికి అంతగా తెలియకపోవచ్చు. సినిమా మీడియానే పూర్తిగా గుర్తించలేదు.

తాజాగా సోషల్ మీడియాలో సామ్ రిలీజ్ చేసిన ఫోటో చూస్తే అందులో చై- సామ్.. లక్ష్మి గారితో పాటుగా ఉన్న ఆ ముగ్గురి వివరాలు తెలిశాయి. అందులో ఒకరు చైతూకి స్టెప్ ఫాదర్ శరత్ విజయ్ రాఘవన్.. ఇంకొకరు స్టెప్ బ్రదర్. నాగచైతన్య మాతృమూర్తి లక్ష్మి దగ్గుబాటి నాగార్జున నుంచి విడిపోయాక చెన్నయ్ కి చెందిన శరత్ విజయ్ రాఘవన్ ని వివాహం చేసుకున్నారు. శరత్ -లక్ష్మి జంటకు జన్మించిన యంగర్ బ్రదర్ బర్త్ డే సందర్భంగా చైతూ- సామ్ సింగపూర్ వెళ్లారు.

మొన్ననే గోవాలో చైతూ బర్త్ డే సెలబ్రేషన్ ని ఘనంగా జరుపుకుని ఇంతలోనే అంత హడావుడిగా సింగపూర్ ట్రిప్ ఏమిటి అనుకున్న వారికి ఊహించని వివరమే తెలిసింది. వెంట వెంటనే ఈ బర్త్ డేని కూడా అక్కినేనీస్ కవర్ చేశారన్నమాట. వరుస ఈవెంట్ల కథేమిటి? అని ఆరా తీస్తే ఈ సంగతులు అన్నీ తెలిశాయి.. అది కూడా ఆ ఒక్క ఫోటోతో. చైతూ కుటుంబ సభ్యులంతా సింగపూర్ లో సరదాగా టైమ్ స్పెండ్ చేశారు. ఇక నాగచైతన్య చెన్నయ్ లో తన తల్లిగారైన లక్ష్మితోనే ఎదిగారు కాబట్టి స్టెప్ ఫాదర్ శరత్ తోనూ గొప్ప అనుబంధం ఉంది. ఈ ఫోటోలో చైతూ బ్రదర్ తో పాటు ఆయన సతీమణి కూడా ఉన్నారు. సమంత పక్కనే ఉన్నది తనే.
Please Read Disclaimer