నిఖిల్ మామ సైలెంట్ అయ్యాడేంటి?

0

సెలక్టివ్ గా కథల్ని ఎంచుకుంటూ వైవిధ్యం ఉన్న సినిమాలతో ఎంటర్ టైన్ చేసే ప్రతిభావంతుడిగా నిఖిల్ కి పేరుంది. అతడి ఎంపికలపై ఆడియెన్ కి పూర్తి గురి ఉంది. అందుకే నిఖిల్ ఓ సినిమా చేస్తున్నాడు అంటే దానిపై అంచనాలు అదే స్థాయిలో ఉంటాయి. అయితే గత కొంతకాలంగా నిఖిల్ కెరీర్ ఊహించని డైలమాలో పడింది. అర్జున్ సురవరం రిలీజ్ సందిగ్ధంలో పడడం రకరకాల వివాదాలు అతడికి డ్రాబ్యాక్ అయిన సంగతి తెలిసిందే. అయితే అర్జున్ సురవరం వివాదాల్లో రిలీజైనా నిఖిల్ కెరీర్ లో మరో హిట్ చిత్రంగా నిలవడం ఆసక్తిని రేకెత్తించింది.

ఆ సినిమా రిలీజ్ తర్వాతా నిఖిల్ వైపు నుంచి సౌండ్ లేదేమిటో!. ఇప్పటివరకూ తదుపరి సినిమాకి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 లో నటిస్తున్నాడని … గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మరో సినిమాకి సన్నాహాలు చేస్తున్నాడని ప్రకటనలు అయితే వచ్చాయి కానీ వాటికి సంబంధించిన అప్ డేటెడ్ సమాచారం ఇంతవరకూ లేదు. నిఖిల్ మామ ఇటీవల ఎందుకనో సైలెంట్ అయ్యాడు.

బహుశా 2020లో పెళ్లితో ఓ ఇంటివాడు కాబోతుండడమే అందుకు కారణమా? అన్నది తనే చెప్పాల్సి ఉంటుంది. తేజస్విని అనే డాక్టర్ ని ప్రేమించి పెద్దల అంగీకారంతో నిఖిల్ పెళ్లాడుతున్నాడన్న ప్రచారం ఉంది. ఇక దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ వేసవిలోనే వివాహం ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది.