మహానటి ఎందుకు దూరమవుతోంది?

0

గత ఏడాది మహానటి సినిమా ద్వారా వారు వీరు అని తేడా లేకుండా అందరితోనూ ప్రశంశలు గుప్పించుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత డబ్బింగ్ సినిమాల్లో తప్ప తెలుగు ప్రేక్షకులకు స్ట్రెయిట్ గా దర్శనం ఇవ్వలేదు. పోనీ తమిళ్ లో ఏమైనా గొప్ప పాత్రలు చేసిందా మంచి పేరు వచ్చిందా అంటే అదీ లేదు. సామీ స్క్వేర్-పందెం కోడి 2-సీమ రాజా లాంటి రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమాల్లో మాములు హీరోయిన్ వేషాలు వేసింది. అఫ్ కోర్స్ దేంట్లోనూ గ్లామర్ షో చేయలేదు లెండి.

ఇప్పుడు తన కెరీర్ కు అదే ప్రతిబంధకంగా మారినట్టు కనిపిస్తోంది. నేను శైలజతో తొలిబోణినే హిట్టు కొట్టిన కీర్తి ఆ తర్వాత నేను లోకల్ తో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది. ఇక మహానటి గురించి తెలిసిందే. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందనే అనుకున్నారందరూ. కానీ జరుగుతోంది వేరు. కీర్తికి ఇక్కడ భారీ ఆఫర్స్ రావడం లేదు. పెద్ద హీరోలు ఛాయస్ గా పెట్టుకోవడం లేదు. ఇప్పుడు ట్రెండ్ ప్రకారం గ్లామర్ చూపించడం లిప్ లాక్ కిస్సులకు ఓకే చెప్పడం లాంటివి ఒప్పుకోనందు వల్లే ఛాన్సులు పోతున్నాయా అంటే పూర్తిగా కొట్టిపారేయలేని పరిస్థితి.

ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టుతో పాటు మరక్కార్ అనే పీరియాడిక్ మల్టీ స్టారర్ లో చేస్తోంది. వీటిలో కూడా ఎలాంటి మసాలాలు ఉండవు. కాస్త పట్టువిడుపు ఉంటే తప్ప తనకు పెద్ద అవకాశాలు రావు అనేది ఇన్ సైడ్ టాక్. సౌందర్య తరహాలో ఓ సిద్ధాంతానికి కట్టుబడటం మంచిదే కానీ ట్రెండ్ కు తగ్గట్టు వెళ్తేనే కదా ఇండస్ట్రీలో వర్క్ అవుట్ అయ్యేది. కీర్తి సురేష్ దీన్ని అర్థం చేసుకుని వంటబట్టించుకుంటుందో లేదో కానీ తనను మిస్ అవుతున్నందుకు ఫ్యాన్స్ మాత్రం తెగ వర్రీ అవుతున్నారు
Please Read Disclaimer