పవన్ వేగం వెనుక అదా అసలు సీక్రెట్!

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తూ షాక్ ల మీద షాక్ లిస్తున్నాడు. ఇప్పటికే లాయర్ సాబ్ ని అనౌన్స్ చేసి సెట్స్ కు తీసుకెళ్లాడు. క్రిష్ చిత్రం మరికొద్ది రోజుల్లో షూటింగ్ ప్రారంభం కానుంది. హరీష్ శంకర్ ప్రాజెక్ట్ లైన్ లో పెట్టాడు. ఇంకా మరో రెండు ప్రాజెక్ట్ లకు సంబంధించి చర్చలు వెడెక్కిస్తున్నాయి. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్..యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి చర్చలు జరుపుతున్నట్లు వినిపిస్తోంది.. మరి పవన్ ఒక్కసారిగా ఇలా వరుస పెట్టి సినిమాలు చేయడం వెనుక కారణం ఏంటి? ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన తర్వాత మళ్లీ ఈ మేకప్ వేషాలేంటి? అదీ వరుస పెట్టి వస్తోన్న సినిమా ప్రకటనల వెనుక అసలు సంగతి ఏంటి? అంటే ఆసక్తికర కథనాలు వెడెక్కిస్తున్నాయి.

మొన్నటి వరకూ రాజధాని అమరావతి రైతులకు మద్ధతుగా నిలిచిన పవన్ ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ పై రకరకాల విమర్శలు వెల్లువెత్తగా .. అంతే ధీటుగా పవన్ సినిమాలు చేసుకుంటే తప్పేముందని సపోర్ట్ చేస్తున్ ప్రకాశ్ నారాయణ్ లాంటీ మాజీ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఇంకా పలువురు రాజకీయ నిపుణులు పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయితే రాజధాని రైతులకు మద్దతు పలికినన్ని రోజులు రెండు అగ్ర పత్రికలు పవన్ కు బాకా కొట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో జనసేన మీడియా సమావేశాలని కవర్ చేయని ఆ రెండు పత్రికలు ఇప్పుడు స్వరం మార్చాయి.

ఆయనపై మళ్లీ విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాయి. పవన్ కి అభిమానుల బలం తగ్గిపోతుందని…ఆయన క్రేజ్ మార్కెట్ లో పడిపోతుందనే ఇప్పుడి హుటా హుటిన పవన్ వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తున్నారని ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు గనుక సినిమాలు చేయకపోతే మొదటికే మోసం వస్తుందని పవన్ ఇలా ట్విస్టులు ఇస్తున్నారని కొత్త ప్రచారానికి తెరలేపాయి. మరి నిజంగా పవన్ విషయంలో అలా జరుగుతుందా? లేదా? అన్నది అభిమానులే తేల్చాలి.
Please Read Disclaimer