దర్బార్ లో రజనీ పేరు వెనుక అసలు నిజమిది

0

సినిమా ఇండస్ట్రీలో కొన్నికాంబినేషన్లకు ఉండే క్రేజ్ అలాంటి ఇలాంటి కాదు. సంచలన చిత్రాలేకాదు.. సంచలన విజయాల్ని సాధించే చిత్రాల్ని తీసే దర్శకుడిగా మురుగదాస్ కున్న పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పేదమీ లేదు. అలాంటి ఇద్దరు ప్రముఖులు ఒక సినిమాకు పని చేస్తే.. ఆ సినిమా మీద ఉండే అంచనాలు అన్ని ఇన్ని కావు. సంక్రాంతి పండుగ రేసులో తొలుత వస్తున్న చిత్రం దర్బార్.

ముంబయి బ్యాక్ డ్రాప్ లో సూపర్ కాప్ గా రజనీ నటించనున్నారు. పవర్ ఫుల్ పాత్రకు మురుగదాస్ దర్శకత్వం తోడైతే ఆ సినిమా ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనంగా దర్బార్ నిలుస్తుందన్న మాట వినిపిస్తోంది. ఈ సినిమాలో పోలీసు అధికారిగా నటిస్తున్న రజనీ పాత్ర పేరు ఏం పెట్టాలన్న దాని మీద భారీగానే కసరత్తు జరిగిందట. ఆ విషయాన్ని మురుగదాసే స్వయంగా చెప్పుకొచ్చారు.

సమాజంలో జరిగే అన్యాయాలకు తనదైన శైలిలో న్యాయం చేసే పోలీసు కథ ఇదని.. అందులో ఫ్యాన్స్ ఆశించే రజనీ మార్క్ మేనరిజమ్స్.. స్టయిల్స్ ఉంటాయిన చెబుతున్నారు. రజనీని స్క్రీన్ మీద ఎలా చూడాలని ఆశిస్తారో.. అలాంటివన్నీ ఉంటాయని.. ఇప్పటి తరం వారు సైతం కనెక్ట్ అయ్యేలా దర్బార్ మూవీ ఉంటుందని చెబుతున్నారు.

దర్బార్ లో రజనీ పాత్రకు పవర్ ఫుల్ పేరు పెట్టాలని చాలా ఆలోచించారట మురుగదాస్. ఒకదశలో షూటింగ్ స్టార్ట్ అయ్యాక పెట్టాలని డిసైడ్ అయ్యారట. అయితే.. హీరో వేసుకునే పోలీస్ యూనిఫామ్ మీద నేమ్ ప్లేట్ తయారు చేయాలని ముందే అడిగే సరికి.. తన తండ్రి అరుణాచలం.. తన కుమారుడు ఆదిత్య పేర్లు కలిపి ఆదిత్యా అరుణాచలం అన్న పేరును పెట్టినట్లు చెప్పారు. అలా దర్బార్ లో రజనీ పాత్ర పేరు డిసైడ్ అయినట్లు వెల్లడించారు.
Please Read Disclaimer