సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

‘ఆర్ ఆర్ ఆర్’ పోస్ట్ పోన్ రీజన్స్ అవే?

0

ఈ ఏడాది మోస్ట్ ఎవైటింగ్ సినిమాల్లో ముందు వరుసలో ఉంది ‘ఆర్ ఆర్ ఆర్’. ‘బాహుబలి’ ప్రాంచైజీ తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమా కావడం పైగా ఎన్టీఆర్ రామ్ చరణ్ మల్టీ స్టారర్ చేయడంతో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ఏడాది జులై 30న రిలీజ్ అంటూ ఆ మధ్య ఓ ప్రెస్ మీట్ పెట్టి డేట్ అనౌన్స్ చేసేసాడు జక్కన్న. కట్ చేస్తే ఇప్పుడు ఆ డేట్ కి సినిమా రావడం లేదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

నిజానికి జక్కన్న ప్లాన్ ప్రకారం సినిమా ఈ పాటికే షూటింగ్ పూర్తవ్వాలి. కానీ అనుకోకుండా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ షూటింగ్ ను డిస్టర్బ్ చేసాయి. అందులో ఒకటి చరణ్ గాయపడటం. షూటింగ్ సమయంలో చరణ్ కి గాయమైంది. అందువల్ల నెలపైనే చరణ్ ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకున్నాడు. రెండో రీజన్ తారక్ హీరోయిన్ . ముందుగా చరణ్ సరసన అలియా భట్ ను అలాగే తారక్ కి హీరోయిన్ గా డైసీ ఎడ్గర్ జోన్స్ ను తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల డైసీ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. వెంటనే తారక్ కి మరో హీరోయిన్ ను వెతికే పనిలో బిజీ అయ్యారు మేకర్స్. ఎట్టకేలకు ఈ మధ్యనే బ్రిటీష్ నటి ఒలివియా మోరిస్ ను తీసుకున్నారు. ఈ మధ్యలో తారక్ -హీరోయిన్ పై తీయాల్సిన కొన్ని సన్నివేశాలు పోస్ట్ పోన్ అయ్యాయి.

ఇక ఇవే కాదు సినిమా షూటింగ్ మద్యలో రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి జరిగింది. ఇంట్లో పెళ్లి కావడంతో రాజమౌళి అండ్ ఫ్యామిలీ తో పాటు హీరోలు కూడా బ్రేక్ తీసుకొని పెళ్లికి వెళ్లి ఎంజాయ్ చేసారు. కార్తికేయ పెళ్లి వల్ల దాదాపు పది రోజుల పైనే షూటింగ్ బ్రేక్ వచ్చింది. సో ఇలా అనుకున్న సమయానికి షూటింగ్ జరగకపోవడంతో సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. ఇంకా మూడు నెలల దాక షూటింగ్ ఉంటుందని సమాచారం. అది పూర్తయ్యాక ఎటు లేదన్నా ఐదారు నెలలపైనే పోస్ట్ ప్రొడక్షన్ కి టైం తీసుకుంటాడు రాజమౌళి. సో ఈ లక్కన చూస్తే జులై లో సినిమా కష్టమే ఇక సంక్రాంతి ఒక్కటే మేకర్స్ కి బెస్ట్ ఆప్షన్ అందుకే ప్రస్తుతం రిలీజ్ డేట్ పై డిస్కర్షన్స్ జరుగుతున్నాయి. మరి కొన్ని రోజుల్లోనే ఈ డేట్ పై క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.
Please Read Disclaimer