ఇసుక వల్లే సాహో వాయిదా ?

0

అదేంటి ఇసుకకు సాహో రిలీజ్ కు సంబంధం ఏమిటి అనుకుంటున్నారా. అక్కడికే వస్తున్నాం. ఆగస్ట్ 15 విడుదల అని ముందు అంత గట్టిగా ఫిక్స్ చేసుకుని తీరా డేట్ దగ్గర పడుతున్న టైంలో రెండు వారాలు వాయిదా వేసి ఆగస్ట్ 30కి షిఫ్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయంగా మొదట కొంత అసంతృప్తికి లోనైనా ఆ తరువాత కొత్త డేట్ కి గ్యాప్ తక్కువ కాబట్టి సర్దుకున్నారు. అసలు ఇలా జరగడానికి కారణాలు చాలానే వినిపిస్తున్నప్పటికీ ఇన్ సైడ్ సోర్స్ నుంచి వచ్చిన అప్ డేట్ మాత్రం డిఫరెంట్ గా ఉంది.

ఇందులో హెల్ బాయ్ లాంటి రాక్షసులను పోలిన ఫారిన్ ఫైటర్స్ తో ప్రభాస్ ఫైట్ చేసే భారీ యాక్షన్ ఎపిసోడ్ ఒకటి ఉంది. అందులోనే ఇసుక తుఫాను వస్తుంది. దీన్నే టీజర్ చివర్లో గమనించవచ్చు. దర్శకుడు సుజిత్ దీన్ని పేపర్ మీద రాసుకుని ఓ రేంజ్ లో విజువలైజ్ చేసుకుని షూట్ చేశాడట. తీరా విఎఫ్ ఎక్స్ వర్క్ జరిగిన తర్వాత ఫైనల్ కట్ చూస్తే చాలా తేడాగా అనిపించిందట

దీంతో సదరు పార్ట్ మొత్తాన్ని మళ్ళీ రీ ఎడిట్ చేసి ఎఫెక్ట్స్ ని మార్చమని చెప్పి తిప్పి పంపారట. అయితే సదరు సంస్థ ఇంకో వారం పది రోజులు అదనంగా గడువు ఇస్తే తప్ప క్వాలిటీకి గ్యారెంటీ ఇవ్వలేమని చెప్పడంతో వాయిదా ఆలోచనకు బలం చేకూరిందట. ఈ ఒక్క సీన్ చాలా కీలకం కావడంతో పాటు ఏ మాత్రం అటుఇటుగా వచ్చినా ఇంప్రెషన్ మొత్తం పోగొట్టే ప్రమాదం ఉండటంతో ఫైనల్ గా మొత్తం ఎఫెక్ట్స్ మార్చాలనే నిర్ణయం తీసుకున్నారట. టీజర్ చూసిన షాట్స్ కి రేపు రిలీజయ్యాక వచ్చే అవుట్ ఫుట్ ని బట్టి ఇది నిజామా కదా అనేది నిర్ధారణ అవుతుంది. అప్పటిదాకా గాసిప్ గా తీసుకోవాల్సిందే
Please Read Disclaimer