కోడలు మిస్సింగ్.. ఏంటి కథ?

0

ఏఎన్నార్ పెద్ద కొడుకు అక్కినేని వెంకట్ కుమారుడు ఆదిత్య నిశ్యితార్థం చెన్నైకు చెందిన తెలుగు అమ్మాయి ఐశ్వర్యతో జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో అక్కినేని కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. వెంకట్- నాగార్జున- సుమంత్- అఖిల్- నాగచైతన్య- సుశాంత్- అమల- నాగసుశీల- సుప్రియ తో పాటు ఇతరులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోను అఖిల్ తన అభిమానులతో పంచుకున్నాడు. కానీ ఆ ఫోటోలో అక్కినేని కోడలు.. నాగచైతన్య సతీమణి సమంత మాత్రం ఎక్కడా కనిపించలేదు. మరి ఈవెంట్ కు హాజరయ్యే స్నాప్ లో మిస్ అయిందా? లేక అసలు హాజరు కాలేదా? అన్నది ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది.

అదీ నిశ్చితార్ధం తన స్వస్థలమైన చెన్నైలో జరిగింది. దీంతో సమంత మిస్సింగ్ కి కారణాలు ఎంటి? అంటూ సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇంతకీ సామ్ ఏమైనట్టు..? అని ఆరాతీస్తే.. తాజాగా ఆన్సర్ తెలిసింది. ప్రస్తుతం సమంత `ది ఫ్యామిలీ మ్యాన్-2` వెబ్ సిరీస్ లో నటిస్తోంది. షూటింగ్ దిల్లీలో జరుగుతోంది. కొద్ది రోజులుగా ఆ వెబ్ సిరీస్ షూటింగ్ లోనే బిజీగా ఉంది. అయితే శుక్రవారం వెంకీ మామ రిలీజ్ ప్రమోషన్స్ కి సామ్ టైమ్ కేటాయించడంతో కొత్త సందేహం రైజ్ అయ్యింది.

మరిది ఆదిత్య నిశ్చితార్థంలో సామ్ కనిపించకపోవడంతో నెటిజనుల్లో కామెంట్లు వినిపించాయి. జన్మకో పెళ్లి! అలాంటి అరుదైన ఘట్టాన్ని మిస్ అయితే ఎలా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. వెంకీమామ ప్రచారానికి కేటాయించిన సమయాన్ని కూడా ఆదిత్య నిశ్చితార్ధానికి కేటాయించలేకపోయిందేమిటో! అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. కొందరైతే నిశ్చితార్థం మిస్సయినా.. పెళ్లికి హాజరవుతుందని పాజిటివ్ గానూ స్పందించారు.
Please Read Disclaimer