ఈవెంటును అందుకే కర్నూలుకు మార్చారట!

0

సంక్రాంతి సినిమాల హంగామా బాక్స్ ఆఫీసు దగ్గర ముగిసిపోయినట్టేనని చాలామంది అనుకుంటున్నారు కానీ సంక్రాంతి సినిమాలవారు మాత్రం అనుకోవడం లేదు. ఇంకా హడావుడి చేస్తూనే ఉన్నారు. సంక్రాంతి పోటీలో రిలీజ్ అయిన ఒక సినిమాకు యాభై రోజుల థియేట్రికల్ రన్ త్వరలో పూర్తి కానుంది. ఈ సందర్భంగా ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా నిర్మాతలు మాత్రం ఈ ఈవెంట్ కు డబ్బు ఖర్చు పెట్టేందుకు రెడీగా లేరట. దీంతో స్పాన్సర్స్ కోసం జోరుగా వెతుకుతున్నారని సమాచారం.

నిజానికి ఈ కార్యక్రమాన్ని మొదట విజయవాడలో గ్రాండ్ గా జరుపుదామని అనుకున్నారట. అయితే అక్కడ ఈవెంట్ మొత్తం ఖర్చు భరించే స్పాన్సర్స్ దొరకలేదట. పైగా అక్కడ ఉండే క్రౌడ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరనే అనుమానాలు కూడా వచ్చాయట. దీంతో ఆ ఈవెంటును కర్నూలుకు మార్చారని సమాచారం. మరి కర్నూలులో ఈ కార్యక్రమం ఖర్చు భరించే మారాజులు ఎవరైనా దొరుకుతారేమో వేచి చూడాలి.

ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు అందరూ హాజరై తమ ఏరియాలో ఈ సినిమా సాధించిన వసూళ్ల ఘనతలను నంబర్లతో సహా వివరిస్తారట. దీంతో ఈ కార్యక్రమం ఎలా ఉంటుందో అని ఇండస్ట్రీలో కొంతమంది అసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐటీ అధికారుల టీమ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయితే ఈవెంటు మరింత రంజుగా ఉంటుంది.. కెవ్వుకేక కలెక్షన్లకు ఓ సార్థకత చేకూరుతుందని కూడా సెటైర్లు పడుతున్నాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-