దేవరకొండ..దిల్ రాజు ప్రాజెక్ట్ ఆలస్యంకు కారణం ఇదేనా?

0

విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ చేయబోతున్న సినిమాపై చర్చలు జరుగుతున్నాయి. దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ ఒక చిత్రం చేయాల్సి ఉంది. శివ నిర్వాన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ సినిమాకు ఓకే చెప్పాడట. కాని ఈ సినిమా విషయంలో ఒక చిన్న సమస్య ఆ ప్రాజెక్ట్ ఆలస్యంకు కారణం అంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ ప్రాజెక్ట్ లోకి ఏషియన్ సునీల్ ను తీసుకు వచ్చేందుకు విజయ్ దేవరకొండ ప్రయత్నిస్తున్నాడు. ఏషియన్ సునీల్ తో ఉన్న డీల్ కారణంగా దిల్ రాజు బ్యానర్ లో చేయబోతున్న సినిమాకే భాగస్వామిగా చేయాలని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడట. కాని దిల్ రాజు మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం అందుతోంది. దిల్ రాజు ఎక్కువగా సొంతంగానే సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తాడు. అందుకే ఈ సినిమాను సొంతంగానే నిర్మించాలని ఆయన భావిస్తున్నాడట.

విజయ్ దేవరకొండ మాత్రం ఏషియన్ అధినేత సునీల్ కు ఇచ్చిన మాట మేరకు ఆలోచనల్లో ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. దిల్ రాజు నో అయితే చెప్పలేదు కాని ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. చివరకు దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఏషియన్ సునీల్ ను చేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ సమాచారం అందుతోంది. శివ నిర్వాన ఇప్పటి వరకు తీసిన రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా విజయ్ దేవరకొండతో కూడా ఆయన ఖచ్చితంగా ఒక మంచి సినిమాను తీస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
Please Read Disclaimer