ఉపాసన అవధుల్లేని ఆనందానికి కారణం

0

మెగా కోడలు.. గ్రేట్ ఎంటర్ ప్రెన్యూర్ ఉపాసన కొణిదెల నిరంతరం సామాజిక మాధ్యమాల్లో ఎంతో స్పీడ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అక్కడ భర్త చరణ్ నటించే సినిమాలకు ప్రమోషన్ చేయడమే కాదు.. మెగా ఫ్యామిలీ విశేషాల్ని తెలియజేస్తుంటారు. ఇక వీటన్నిటినీ మించి అపోలో హెల్త్ తరపున ఆరోగ్యానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాల్ని అభిమానులకు చేరవేస్తుంటారు. పనిలో పనిగా తన ఫిజికల్ ఫిట్ నెస్ సీక్రెట్స్ ని ఇటీవల వెల్లడించడం ఆసక్తిని కలిగించింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉపాసన చేస్తున్న మహాయజ్ఞం ఫలిస్తోంది. ఇక యూట్యూబ్ చానెల్ ప్రారంభించిన తక్కువ సమయం లోనే 10లక్షల మంది ఫాలోవర్స్ ని సంపాదించడం మరో అఛీవ్ మెంట్ అనే చెప్పాలి.

`బిపాజిటివ్ విత్ ఉపాసన` పేరిట రన్ అవుతున్న యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి పలువురు సెలెబ్రిటీ ల చేత ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్ ఇవ్వడం ఆకట్టుకుంది. అందుకే ఇంత వేగంగా యూట్యూబ్ చానెల్ కి చక్కని సబ్ స్క్రైబర్స్ లభించారట. ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఇంటర్వ్యూ.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటర్వ్యూన మెగా ఫ్యాన్స్ లో వైరల్ అయ్యాయి. టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత.. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ వంటి టాప్ సెలబ్రిటీల ప్రత్యేక ఇంటర్వ్యూలు వైరల్ అయ్యాయి. ఆ క్రమంలోనే వేగంగా ఈ అఛీవ్ మెంట్ సాధ్యమైంది. తాజా అఛీవ్ మెంట్ కి కానుకగా యూట్యూబ్ వాళ్లు ఉపాసనకు సిల్వర్ ప్లగ్ మొమెంటోని బహుకరించారు. అందుకు సంబంధించిన ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేసిన ఉపాసన ఎంతో ఎగ్జయిట్ అయ్యారు.

ఈ మెమెంటో ను మెగా ఫ్యాన్స్ కి చూపించి ఈ మైలురాయికి చేరుకోవడానికి మీ ఆదరణే కారణం అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు స్ఫూర్తినిచ్చిన మిస్టర్ సి (రామ్ చరణ్)కి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. ఉపాసన ట్వీట్ కి రీట్వీట్లు చేస్తూ పలువురు సెలబ్రిటీలు అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఉపాసన కు తన స్నేహితురాలైన సమంత ప్రత్యేకించి అభినందలు తెలిపారు.
Please Read Disclaimer