నిర్మాత వెల్లడించిన షాకింగ్ నిజం.. ఆ హీరో రూమ్ లో అంజలి

0

ఒక హీరోయిన్ అలా ఉండేది? ఇలా చేసింది? అన్న మాటలే కాదు.. ఆ హీరో ఆ హీరోయిన్ తో కలిసి ఒకే రూమ్ లో ఉండేవారన్న షాకింగ్ వ్యాఖ్యల్ని ఒక నిర్మాత ఓపెన్ గా వెల్లడించటం ఇప్పటివరకూ చూసింది లేదు. తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేసి సంచలనంగా మారారు నిర్మాత నందకూమార్. హీరో జై.. హీరోయిన్ అంజలి రిలేషన్ మీద షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

అంజలి మంచి అమ్మాయే కానీ.. జై ఎంట్రీ తర్వాత ఆమె ట్రాక్ మారి పోయిందన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఊహించలేని విషయాల్ని వెల్లడించారు. జై.. అంజలి ఇద్దరు కలిసి తొలుత జర్నీ సినిమాలో నటించగా.. తర్వాత వీరిద్దరూ కలిసి బెలూన్ చిత్రం లో నటించారు. జై కారణంగా తాను చాలా నష్ట పోయినట్లు చెప్పిన నందకుమార్.. అందుకు సంబంధించిన విషయాల్ని రివీల్ చేశారు.

కొడైకెనాల్ లో హీరో జైకు.. హీరోయిన్ అంజలికి వేర్వేరు గా రూములు బుక్ చేశామని.. కానీ వారిద్దరూ ఒకే రూమ్ లో ఉండేవారన్నారు. సరే.. ఒక రూమ్ క్యాన్సిల్ చేస్తామంటే వద్దనే వారని.. ఈ కారణంగా రోజుకు రూ.12వేలు చొప్పున నష్ట పోయినట్లు చెప్పారు.

షూటింగ్ లో అంజలి అని పేరు పెట్టి పిలవకూడదని.. మేడమ్ అని మాత్రమే పిలవాలని కండీషన్ పెట్టేవాడన్నారు. ఎవరైనా అంజలి అని పిలిస్తే.. షూటింగ్ ఆపేస్తానని బెదిరించేవాడన్నారు. ఒక రోజు అంజలి షూట్ కు రాలేదని.. తాము ఎన్నిసార్లు ఫోన్లు చేసినా తీయలేదని.. చివరకు ఆమె కడుపు నొప్పిగా ఉందని చెప్పిందన్నారు.

రూముకు కారు పంపినా రాలేదన్న ఆయన.. అదేరోజు జై.. అంజలి కలిసి తాము పంపిన కారులో ఎయిర్ పోర్టుకు వెళ్లి అక్కడ నుంచి చెన్నైకి వెళ్లారన్నారు. ఈ కారణంగా షూట్ ఆపేశామన్నారు. జై తీరుతో తాను చాలా నష్టపోయినట్లుగా చెప్పారు. మరి.. దీనికి అంజలి.. జై ఎలా రియాక్ట్ అవుతారో?
Please Read Disclaimer