భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం - LIVE

చౌదరిని అయినా కుక్క చాకిరీ చేయించారు

0

బుల్లి తెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అనిత చౌదరి ఆ తర్వాత వెండి తెరపై కూడా మెరిసింది. తొలి తరం యాంకర్స్ లో అనిత చౌదరి ముందు వరుసలో ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. సుమ.. జాన్సీ.. ఉదయభానులతో పాటు అప్పట్లో అనిత చౌదరికి కూడా మంచి డిమాండ్ ఉండేది. యాంకర్ గా అవకాశాలు తగ్గిన సమయంలో నటిగా ప్రయత్నించింది. నటిగా ఎక్కువగా ఈమె కనిపించలేదు. ఈమద్య కాలంలో ఈమె బొత్తిగా నల్లపూస అయ్యింది.

యాంకర్ గా గతంలో తెచ్చుకున్న గుర్తింపుతోనే ఇంకా కెరీర్ ను నెట్టుకు వచ్చే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా అనిత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆశ్చర్యకర విషయాలు వెళ్లడిచ్చింది. ముఖ్యంగా తాను చౌదరి అవ్వడం వల్లే అవకాశాలు వచ్చాయి.. అవకాశాల కోసం చౌదరిని పేరుకు చివర్లో తగిలించుకున్నాను అంటూ వచ్చే కామెంట్స్ కు విమర్శలకు అనిత చౌదరి గట్టి సమాధానం ఇచ్చింది.

నా పేరు అనిత చౌదరి అని ఈటీవీలో ఒక పోగ్రాం చేస్తున్న సమయంలో నిర్వాహకులు వేశారు. చౌదరి తీయమంటే ఆ సమయంలో వారు వేశాం కదా ఉండనివ్వండి.. అనితలు ఇంకా వేరే కూడా ఉన్నారు. కనుక అనిత చౌదరి అని పెడితే మీకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని అలాగే కంటిన్యూ చేశారు. యాంకర్ గా కెరీర్ ఆరంభంలో ఆఫీస్ బాయ్ కి ఎక్కువ యాంకర్ కు తక్కువ అన్నట్లుగా నన్ను చూసే వారు. చౌదరి అని పెట్టుకున్నంత మాత్రాన నాకేం ఈజీగా ఆఫర్లు రాలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో తాను కూడా చాలా స్ట్రగుల్స్ పడ్డానంది.

ఇక తన తోటి యాంకర్స్ సుమ.. జాన్సి.. ఉదయ భానుతో మంచి రిలేషన్ ఉందని గతంలో తరచు కలిసేవాళ్లం. కాని పిల్లలు పుట్టిన తర్వాత కలవడం కుదరడం లేదని చెప్పుకొచ్చింది. ఇక అక్కినేని ఫ్యామిలీతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నాగేశ్వరరావు గారు మరియు నాగార్జున గారితో నాకు మంచి అనుబంధం ఉంది. వారిని అవకాశం కావాలని అడిగేంత స్వేచ్చ నాకు ఉండేదని చెప్పుకొచ్చింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-