రీఎంట్రీ: పవన్ అసలు డిసైడ్ కాలేదా?

0

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా గురించి భారీగా చర్చలు సాగుతున్నాయి. డైరెక్టర్ ఫైనలైజ్ అయ్యారని.. నిర్మాత ఫైనలైజ్ అయ్యారని.. స్క్రిప్ట్ ఒకరు రాస్తున్నారని.. యంగ్ డైరెక్టర్లను పరిశీలిస్తున్నారని.. నవంబర్ 15 న కొబ్బరికాయ కొడతారని..ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఈ హంగామా వెనుక కొందరు నిర్మాతలు.. దర్శకుల అత్యుత్సాహం ఉందన్నది తాజాగా వినిపిస్తున్న టాక్.

కొందరు నిర్మాతలు తమ సినిమా పవన్ చేస్తున్నారంటూ లీక్స్ ఇస్తూ పవన్ సినిమాపై వేరే వ్యక్తులు కర్చీఫ్ వెయ్యకుండా జాగ్రత్త పడుతున్నారట. అయితే దీన్ని చూసి ఇతరులు కూడా అదే స్ట్రేటజీ ఫాలో అవుతున్నారట. దీంతో ఒకే సమయంలో ముగ్గురు నలుగురు నిర్మాతలతో సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు పవన్ సినిమాకు దర్శకుడిగా వినిపిస్తున్న పేర్లలో ఒక్కరూ టాప్ లీగ్ డైరెక్టర్ కాదు. దీంతో ఆ దర్శకులే డిమాండ్ ఉందని నిరూపించుకునేందుకు ఇలాంటి లీక్స్ ఇస్తున్నారని అంటున్నారు. దీంతో ఎవరు పవన్ సినిమా చేస్తున్నారో ఎవరికీ అర్థం కాకుండా ఉంది.

ఏతావాతా తేలేదేంటంటే.. పవన్ అసలు నిర్ణయం సినిమాకు నిర్ణయం తీసుకున్నాడా లేదా అనే విషయం కూడా ఎవ్వరికీ తెలియదట. ఇక ఎవరు నిర్మాత.. ఎవరు దర్శకుడు.. అనే విషయాలకు అసలు అర్థమే లేదు. అయితే ఒకటి మాత్రం నిజం.. అందరూ పవన్ సినిమా కోసం తీవ్రంగా ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. ప్రయత్నాల ఫలితమే ఈ రచ్చ. ఒకవేళ పవన్ ‘యస్’ అంటే మాత్రం ఆ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
Please Read Disclaimer