మెగాస్టార్ 152 కి నో చెప్పిందట

0

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడి గా నటించనున్న 152వ చిత్రం ఈ గురువారం హైదరాబాద్ లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం లో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ-మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఇందులో హీరోయిన్ ఎవరు? చిరుకు ప్రతి నాయకుడు ఎవరు? మిగతా కీలక పాత్ర ధారులు ఎవరు? అన్నది రివీల్ చేయలేదు. ఇప్పటికే హీరోయిన్ గా త్రిష పేరు వినిపిస్తోంది గానీ! పాన్ ఇండియా కేటగిరీలో ప్లాన్ చేస్తోన్న నేపథ్యం లో త్రిష స్థానంలో ఓ బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలింది.

ఇక మెగా మూవీ అంటే ఐటం సాంగ్ తప్పని సరి కాబట్టి ఆ పాటలో రెజీనా కసాండ్రాని ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ అమ్మడు ఐటంనంబర్ కు అంగీకరించలేదని తాజాగా కథనాలొస్తున్నాయి. దీంతో మేకర్స్ మరో కొత్త భామను వెతికే పనిలో పడ్డట్లు సమాచారం. కానీ రెజీనా ఆ అరుదైన అవకాశం ఎందుకు మిస్ చేసుకుంది? దాని వెనక ఉన్న క్యాలిక్యులేషన్ ఏమిటి? అన్నది తేలలేదు. చిరు సరసన ఛాన్స్ కోసం ఎంతో మంది భామలు కలలు కంటారు. ఆయన తో ఒక్క సీన్ లో అయినా తెరను పంచుకువాలని ఉవ్విళ్లూరుతుంటారు. కానీ రెజీనా వచ్చిన అవకాశాన్నే కాదనుకుంది.

మరి ఎందుకలా చేసింది? రెజీనాకి టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు కూడా లేవు. అయితే కోలీవుడ్ లో మాత్రం పుల్ బిజీగానే ఉంది. ప్రస్తుతం అక్కడ ఆరు సినిమాల్లో నటిస్తోంది. అందులో నాలుగు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. మరో రెండు షూటింగ్ డిలే అవుతున్నాయి. ఆ కారణంగా డేట్లు సర్దుబాటు చేయడం లో విఫలమై రిజెక్ట్ చేసిందా? అన్నది తెలియాల్సి ఉంది. కారణం ఏదైనా ఇలాంటి అవకాశం మళ్లీ రావడం అనేది అంత ఈజీ కాదు.
Please Read Disclaimer