సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

మెగాస్టార్ నే ఫిదా చేసిందట

0

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఐటెం సాంగ్ ను ఇటీవలే చిత్రీకరించారు. ఆశ్చర్యకరంగా ఈ ఐటెం సాంగ్ కోసం దర్శకుడు కొరటాల శివ రెజీనాను తీసుకోవడం జరిగింది. మెగా హీరోలు శిరీష్.. సాయి ధరమ్ తేజ్ లతో పాటు పలువురు చిన్న హీరోలతో నటించినా కూడా పెద్దగా సక్సెస్ లు రాకపోవడంతో ఈమె కనిపించకుండా పోయింది. మళ్లీ మెగా 152 చిత్రంలో ఐటెం సాంగ్ తో రీ ఎంట్రికి సిద్దం అయ్యింది.

పల్లెటూరు నేపథ్యంలో ఫోక్ సాంగ్ తో చిరంజీవి.. రెజీనాలపై పాటను చిత్రీకరించడం జరిగిందట. ఆ సందర్బంగా రెజీనా డాన్స్ చూసిన యూనిట్ సభ్యులు అంతా కూడా నోరు వెళ్లబెట్టారట. ఇన్నాళ్లు ఇంత మంచి డాన్సర్ అయిన మీరు ఎక్కడున్నారు అంటూ అంతా కూడా ఆమెను అభినందించారట. ఇక ముఖ్యంగా చిరంజీవి స్టెప్స్ లో తనను మ్యాచ్ చేసినందుకు గాను రెజీనా విషయంలో ఫిదా అయినట్లు గా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. రెజీన ఇప్పటి వరకు ఏ సినిమా లో కూడా పెద్దగా డాన్స్ ను నిరూపించుకునే స్థాయిలో అవకాశం రాలేదు.

సాయి ధరమ్ తేజ్ తో గువ్వా గోరింక తో చేసినా కూడా అందులో తేజ్ ది హైలైట్ అయ్యేలా కొరియోగ్రఫీ ఉంటుంది. కాని ఈ చిత్రంలో చిరంజీవితో ఆమె చేసిన డాన్స్ తో బాగా డాన్స్ చేసే హీరోయిన్స్ జాబితాలో చేరిపోవడం ఖాయం అంటున్నారు. రెజీనా ఈ చిత్రంతో మళ్లీ టాలీవుడ్ లో బిజీ అవ్వడం ఖాయం అంటున్నారు. మెగాస్టార్ మెప్పు పొందింది కనుక ఖచ్చితం గా రెజీనా కు మంచి ఫ్యూచర్ ఉంటుందనిపిస్తుంది.
Please Read Disclaimer