అమ్మడు ఇక్కడ ఫోకస్ చేస్తే అక్కడ సక్సెస్ అవుతోంది…!

0

రెజీనా కాసాండ్ర.. ‘శివ మనసులో శృతి’ సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వచ్చిన ‘రొటీన్ లవ్ స్టోరీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లాంటి సినిమాల్లో నటించి క్రేజ్ తెచ్చుకుంది. ఇటు తెలుగు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు తమిళ కన్నడ సినిమాల్లోనూ ఇమేజ్ కోసం ట్రై చేసింది. అయితే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్నా.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ మాత్రం అందుకోలేకపోయింది రెజీనా. నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్స్ లో పాటు గ్లామర్ క్యారెక్టర్స్ కు కూడా రెడీ అంటూ వచ్చిన ఈ భామకు ఇక్కడ చెప్పుకోదగ్గ అవకాశలు మాత్రం రావటం లేదు.ఇక ‘ఎవరు’ సినిమాలో నెగెటివ్ రోల్ లోనూ మెప్పించిన రెజీనాకు తమిళ్ లో మాత్రం వరుస ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో తెలుగులో నెగిటివ్ రోల్స్.. తమిళంలో పాజిటివ్ రోల్స్ అన్న విధంగా అమ్మడి కెరీర్ సాగుతోంది అని.. అక్కడ ఎమర్జీంగ్ స్టార్ హీరోయిన్.. ఇక్కడ మాత్రం అవుట్ డేటెడ్ హీరోయిన్ అని సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి రెజీనా తమిళంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పొతుంది. దాదాపుగా 6 తమిళ సినిమాలు రెజీనా చేతిలో ఉన్నాయట. గతేడాది హిందీలో కూడా అడుగు పెట్టింది రెజీనా. ఇక తెలుగులో మాత్రం ఇంతవరకు రెజీనా నెక్ట్స్ ప్రాజెక్ట్ పై అప్ డేట్ లేదు.

అయితే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో ఐటమ్ సాంగ్ లో స్టెప్పులేయబోతోందని వార్తలు వస్తున్నాయి. కానీ దీని గురించి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మొత్తం మీద అమ్మడు టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తే ఇతర ఇండస్త్రీలలో ఆఫర్స్ వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Please Read Disclaimer