ఐటెం సాంగ్ కు కొత్త పేరు పెట్టింది

0

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రెజీనా ఐటెం సాంగ్ ను చేసిన విషయం తెల్సిందే. రెజీనాలో మంచి డాన్సర్ ఉందంటూ చిరంజీవి కితాబిచ్చినట్లుగా కూడా ఆమద్య వార్తలు వచ్చాయి. ఐటెం సాంగ్ ను ముందే చిత్రీకరించడంతో అందరిలో కూడా ఆ ఐటెం సాంగ్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆరు రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించినట్లుగా రెజీనా చెప్పుకొచ్చింది.

తాజాగా ఐటెం సాంగ్ గురించి రెజీనా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రత్యేక గీతాల్లో నటించడం అంటే నాకు నచ్చదని కాని మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో అనడం వల్ల నేను ఒప్పుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. చిరంజీవి గారి డాన్స్ ను చూసి నేను ఇన్సిఫైర్ అయ్యాను. ఆయన ఒక గొప్ప డాన్సర్ అంది. నాకు డాన్స్ అంటే ఇష్టం. చిరంజీవి గారి డాన్స్ అంటే మరింత ఇష్టమంటూ చెప్పుకొచ్చింది. చిరంజీవి గారితో ఛాన్స్ ఇచ్చినందుకు కొరటాలకు కృతజ్ఞతలు చెప్పింది.

చిరంజీవి గారు నా డాన్స్ ను అభినందించడం చాలా ఆనందాన్ని కలిగించిందని చెప్పింది. ఆచార్య చిత్రం లో తాను చేసింది ఐటెం సాంగ్ కాదని సెలబ్రేషన్ సాంగ్ అంది. ఐటెం సాంగ్ అనుకుండా ఆ పాటను సెలబ్రేషన్ సాంగ్ అని పిలవాలంటూ కోరింది. ప్రత్యేక పాటను అంతా ఐటెం సాంగ్ అనే పిలుస్తారు. ఇప్పుడు కొత్తగా రెజీనా సెలబ్రేషన్ సాంగ్ అంటూ పేరు పెట్టింది. నెటిజన్స్ రెజీనా ‘ఆచార్య’లో చేసింది ఐటెం సాంగ్ కాదంటూ చేసిన వ్యాఖ్యలను ట్రోల్ చేస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-