అత్తారింటికి దారేది సహ నిర్మాతకు వైరస్ పాజిటివ్

0

వారు వీరు అనే తేడా లేకుండా మహమ్మారి వైరస్ అందరిని కూడా కాటు వేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షలకు పైగా వైరస్ బారిన పడ్డ విషయం తెల్సిందే. ఇండియాలో కూడా ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడు ఈ వైరస్ బాలీవుడ్ కు కూడా సోకింది. ఇటీవలే మ్యూజిక్ కంపోజర్ వైరస్ వల్ల మృతి చెందగా ఆయన తల్లికి కూడా వైరస్ పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. తాజాగా అత్తారింటికి దారేది చిత్రంకు సహ నిర్మాతగా వ్యవహరించిన రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సీఈఓ శిబాశిష్ సర్కార్ వైరస్ బారిన పడ్డారు.

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల తీవ్రమైన జ్వరం రావడంతో హాస్పిటల్ కు వెళ్లాడట. అక్కడ వైధ్యులు వైరస్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దాంతో ప్రస్తుతం ఆయన ముంబయిలోని ప్రముఖ హాస్పిటల్ లో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. రియన్స్ ఎంటర్ టైన్ మెంట్ బిగ్గెస్ట్ బాలీవుడ్ చిత్రాలను నిర్మించడం వెనుక శిబాశిష్ సర్కార్ ప్రావిణ్యం చాలా ఉంది.

ఇటీవల బాలీవుడ్ లో ఈయన 83 ఇంకా సూర్యవంశీ సినిమాలను కూడా నిర్మించాడు. 83 చిత్రం విడుదలకు రెడీ అవ్వగా వైరస్ కారణంగా వాయిదా వేశారు. సమ్మర్ లో విడుదల కావాల్సిన సినిమాను ఈ ఏడాది చివరికి విడుదల చేయాలని భావిస్తున్నారు. తెలుగు.. హిందీలోనే కాకుండా పలు భాషల్లో భారీ చిత్రాలను అందించిన సర్కార్ ఆరోగ్యం త్వరలోనే కుదుట పడాలంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కోరుకుంటున్నారు.
Please Read Disclaimer