బన్నీతో రెమ్యునరేషన్ విభేదాలు ?

0

మొన్నటితో ఇరవై ఏళ్ళ ప్రస్థానాన్ని నిర్మాతగా దిగ్విజయంగా పూర్తి చేసుకున్న దిల్ రాజు అగ్ర హీరోలతో నిర్మాణాల పట్ల అంత హ్యాపీగా లేరనే టాక్ గుప్పుమంటోంది. ఫిలిం నగర్ సమాచారం మేరకు అల్లు అర్జున్ తో తీయబోతున్న ఐకాన్ కు సంబంధించి హీరోతో రెమ్యునరేషన్ విషయంలో కొన్ని విభేదాలు వచ్చాయనే మాట జోరుగా వినిపిస్తోంది. దాని ప్రకారం తనకు పారితోషికం బదులుగా నాన్ థియేట్రికల్ రైట్స్ ఇమ్మని బన్నీ అడిగాడట. దాంతో షాక్ తిన్న దిల్ రాజు అటు మహేష్ బాబు ఇటు నువ్వు ఇలా హక్కుల రూపంలో పారితోషికం తీసుకుంటే ఇక తమకేమి మిగులుతుందని చెప్పాడట.

ఇంత రిస్క్ తీసుకుని పెట్టుబడి పెడుతుంటే క్లారిటీ లేకుండా ఇలా హక్కులు గంపగుత్తగా హీరోలకు ఇచ్చేస్తే కేవలం బయ్యర్ల ద్వారా వచ్చే సొమ్ముతో ఇబ్బందుల్లో పడేది తామేనని వివరించారట. సినిమా పోతే తర్వాతి ప్రాజెక్ట్ లో సర్దమని డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒత్తిడి ఉంటుందని కానీ హీరోలు ఇలా హక్కులు తీసుకుంటే ఇలాంటి సాధక బాధలు తెలిసే ఛాన్స్ లేదు కాబట్టి అంతా మా మీదే పడుతోందని చెప్పినట్టుగా వినికిడి.

అందుకే మహర్షి ఎంత బిజినెస్ చేసినా ముగ్గురు నిర్మాతలు గొప్పగా చెప్పుకునే స్థాయిలో చేతిలో ఏమి మిగలలేదనే రీతిలో కూడా చర్చించినట్టు గాసిప్స్ వస్తున్నాయి. మొత్తానికి దిల్ రాజు స్టార్లు ఇలా హక్కుల రూపంలో రెమ్యునరేషన్లు తీసుకోవడం గురించి గట్టిగానే ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. ఇదంతా నిజమో కాదో కానీ ఇండస్ట్రీ వర్గాల్లో ఇతర నిర్మాతల మధ్య హాట్ డిస్కషన్ జరుగుతున్న మాట మాత్రం వాస్తవం.హీరోల డామినేషన్ ఉండే సౌత్ మార్కెట్ లో అన్ని బాషల్లోనూ ఉండే సమస్యే ఇది. ఎప్పటికి పరిష్కారం దొరుకుతుందో