మహేష్ తో మూవీ.. నేను విన్న అతి పెద్ద రూమర్!

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ రీఎంట్రీ ప్రస్తుతం హాట్ టాపిక్. బద్రి- జానీ లాంటి తెలుగు చిత్రాల్లో కథానాయికగా నటించిన రేణు పవన్ కల్యాణ్ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత తిరిగి నటించే ఆలోచన చేయలేదు. మరాఠాలో దర్శకురాలిగా.. నిర్మాతగా తన ప్రయత్నాలు తాను చేశారు. రేణు ప్రస్తుతం బుల్లితెర హోస్ట్ గా జడ్జిగా రాణిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత తిరిగి సినీఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహకాల్లో ఉన్నారని ఇటీవల ప్రచారమైంది. మహేష్ తనకు ఓ ఆఫర్ ఇచ్చారన్న ప్రచారం సాగిపోయింది.

అయితే ఇది నిజమా? అని తాజా ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. రేణు ఇచ్చిన ఆన్సర్ ఆశ్చర్యపరిచింది. రేణు దేశాయ్ మాట్లాడుతూ.. మహేష్ నిర్మిస్తున్న మేజర్ చిత్రంలో తాను ఎలాంటి పాత్ర చేయడం లేదని వెల్లడించారు. ఇటీవల నేను విన్న అతి పెద్ద రూమర్ ఇదేనంటూ పేర్కోంది రేణుదేశాయ్. మేజర్ సినిమాలో తాను నటిస్తున్నానని చాలా మంది తనకి అభినందనలు చెబుతున్నారు. అయితే ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. ఒకవేళ సినిమాలకి ఒకే చెబితే నేను క్లారిటీ ఇస్తానని రేణు వెల్లడించారు.

తమ సినిమాల్లో నటించాల్సిందిగా పదే పదే ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఎవరికీ ఓకే చెప్పలేదని కూడా రేణు తెలిపారు. ఇక అడివి శేష్ హీరోగా మహేష్ నిర్మిస్తున్న మేజర్ చిత్రంలో శోభిత ధూలిపాళ కథానాయిక. శశికిరణ్ తిక్క ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
Please Read Disclaimer