ప్రస్తుతం బుల్లి తెరపై త్వరలో వెండి తెరపై కూడా..!

0

రేణు దేశాయ్ సినిమాల్లో నటించి చాలా ఏళ్లు అయినా కూడా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆమెకు ఉన్న స్టార్ డం అంతకంతకు పెరుగుతూనే ఉంది. సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో ఈమె వెండి తెరపై రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చాలా నమ్మకం ఉంది. అయితే ప్రస్తుతానికి తనకు వెండి తెరపై రీ ఎంట్రీ ఇచ్చే ఆసక్తి లేదన్నట్లుగా కొన్నాళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

గతంలో పుణెలో ఉండే రేణు దేశాయ్ కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ షిప్ట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటూ జీ తెలుగు ఛానెల్ తో ఒప్పందం కుదుర్చుకుని ఆ ఛానెల్ కు సంబంధించిన కార్యక్రమాలు ప్రమోట్ చేస్తూ వస్తుంది. తాజాగా జీ తెలుగు సీరియల్స్ పున: ప్రారంభం కాబోతున్నాయి అంటూ ఒక యాడ్ లో నటించింది.

బుల్లి తెర పై కనిపించిన రేణు దేశాయ్ మళ్లీ వెండి తెర పై కూడా కనిపిస్తుందనే నమ్మకంను అభిమానులు పెట్టుకున్నారు. ప్రస్తుతం తెలుగులో ఈమె నటిస్తే ఆఫర్లు వరుసగా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బుల్లి తెర పై సందడి చేసేందుకు ఆసక్తిగా ఉన్న రేణు దేశాయ్ త్వరలోనే వెండి తెరపై కూడా సందడి చేసేందుకు సిద్దం అయ్యే అవకాశం ఉందంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
Please Read Disclaimer