రేణుదేశాయ్ : పిల్లలు పవన్ దగ్గరికే – పిల్లల భవిష్యత్తే ముఖ్యం

0

చాలా రోజుల తరువాత రేణుదేశాయ్ మళ్ళీ వార్తల్లోకి వస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ తో విడిపోయాక తాను మరొక పెళ్లి చేసుకుంటుందని వార్తలు బాగానే వచ్చాయి కానీ అవి కేవలం పుకార్లేనని కొట్టిపారేశారు. అయితే కొంత కాలంగా రేణుదేశాయ్ తన పిల్లలతో ముంబైలో తన మకాం మార్చుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తమ పిల్లలకు తన తండ్రి ప్రేమ మరియు తన కుటుంబ ప్రేమ ముఖ్యమని భావించిన రేణు దేశాయ్ ఇపుడు తిరిగి హైదరాబాద్ లో సిటీ అవ్వడానికి ప్రయత్నిస్తుందని వార్తలు వస్తున్నాయి.

అయితే రేణుదేశాయ్ హైదరాబాద్ లో సెటిల్ అయితే మాత్రం పవన్ తో పాటే మెగా ఫామిలీ సపోర్ట్ కూడా బాగా ఉంటుందని రేణు దేశాయ్ భావిస్తుందని సమాచారం. ఇకపోతే రేణుదేశాయ్ ప్రస్తుతానికి ఈటీవీ లో ఢీ కార్యక్రమానికి జడ్జి గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అంతేకాకుండా నటిగా కూడా తాను మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇదంతా కూడా తన పిల్లలలకోసమేనని అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకుందని రేణు సన్నిహితులు చెబుతున్నారు. అయితే పిల్లల భవిష్యత్తు కోసమే తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను అని చెబుతున్నారు రేణు దేశాయ్.
Please Read Disclaimer