వైరల్ అయిన రేణు దేశాయ్ కవిత

0

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం తెల్సిందే. ఆమె తన వ్యక్తిగత విషయాలను.. పిల్లల ఫొటోలను.. సామాజిక అంశాలను షేర్ చేయడంతో పాటు తనలో దాగి ఉన్న కవి రచించిన రచనలను కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంది. రేణు దేశాయ్ చాలా కాలంగా కవితలు రాస్తూ ఉంది. వాటిని తెలుగులో అనంత శ్రీరామ్ తో ట్రాన్స్ లేట్ చేయించి బుక్ గా కూడా తీసుకు వచ్చింది. తన కవితల్లోంచి ఒక కవితను రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

రేణు ఇంగ్లీష్ లో రాసిన కవితను అనంత శ్రీరామ్ తెలుగులోకి తర్జమా చేశాడు. ఆ కవిత కాస్త ఎమోషనల్ గా ఆకట్టుకునే విధంగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రేణు దేశాయ్ పోస్ట్ చేసిన కవిత వైరల్ అవుతోంది. నా ఆత్మ సంచరిస్తోంది ఈ పెనుగాలుల్లో వివస్త్రగా – విపాదరక్షగా.. అంటూ చాలా బలమైన.. భారమైన పదాలతో ఆమె రాసిన ఈ కవిత అందరి హృదయాలను తాకే విధంగా ఉంది.

ఇంగ్లీష్ మరియు తెలుగు రెండు వర్షన్ లను కూడా నెటిజన్స్ విపరీతంగా షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలుగు వారికి దగ్గరగా ఉంటున్న రేణు దేశాయ్ త్వరలోనే తెలుగు సినిమాల్లో నటించే కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

రేణు దేశాయ్ రాసిన కవితకు తెలుగు ట్రాన్స్ లేట్ ఇదే..

నా ఆత్మ సంచరిస్తోంది ఈ పెనుగాలుల్లో వివస్త్రగా విపాదరక్షగా
తన ఉనికిని చూసి ఆశ్చర్యపోతూ ఇలా అంటోంది నన్ను నా రక్తంలో పరిమితం చేయకు
నా ప్రాణ వాహినిలా నాకు స్వేచ్ఛగా ప్రవహించాలనుంది
తెరలు తెరలుగా వచ్చి బలంగా తాకే వెచ్చటి గాలుల్లో ఈకలా అలా అలా తేలిపోతుంది ఇప్పుడు నా హృదయం
మెరుపు జాడని వెతుక్కుంటూ వెళ్లే జల్లెడ లాంటి మేఘంలా ఉంది
నన్ను ఆపకు – నా నెత్తుటిని ఉబకనివ్వు నేను పరవళ్లు తొక్కాలి – నేను పైపైకెగరాలి నేను కదలాలి – నేను కురవాలి విత్తనమై నేలమ్మ కడుపులో మళ్లీ మొలకెత్తాలి
మళ్లీ వికసించడానికి – మళ్లీ విహరించడానికి