రేణు నటి కాకపోతే ఏమయ్యేదంటే..?

0

ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చాలా మంది నటీనటులు చెబుతుంటారు. కానీ నటి కం నిర్మాత రేణూ దేశాయ్ మాత్రం తాను సైంటిస్ట్ కావాలనుకుందట. ఏదో కావాలనుకుని ఏదో అయ్యానని చెప్పడం అభిమానుల్లో చర్చకొచ్చింది. పవర్స్టార్ పవన్కల్యాణ్ నటించిన `బద్రి` చిత్రంతో రేణూ దేశాయ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా రేణుకు ఇదే తొలి సినిమా. ఈ చిత్రం విడుదలై 25 ఏళ్లు కావస్తోంది.

ఈ సందర్భంగా నటి రేణూ దేశాయ్ తన పాత జ్ఞాపకాల్ని చెరిగిపోయిన డ్రీమ్ ని గుర్తు చేసుకుంది. తను నటిని కావాలనుకోలేదని చెబుతోంది. అంతరిక్ష శాస్త్ర వేత్తని కావాలని వుండేదని అలా కాకుండా కనీసం డాక్టర్ ని అయినా అయ్యుండేదాన్నని చెబుతోంది. విధి మాత్రం తన డ్రీమ్ ని చిదిమేసిందట. శాస్త్రవేత్త కావాలనుకున్న తనని కెమెరా ముందుకు లాగేసిందని వాపోతోంది. నాసాలో శాస్త్ర వేత్తగా చేరాలనుకున్న తన కల అలా కల్లలైపోయిందని చెప్పుకొచ్చింది.

16 ఏళ్ల వయసులో తను కెమెరా ముందుకు వచ్చానని ఆ తరువాత సినిమాలతో ప్రేమలో పడిపోయానని చెబుతోంది. సినీ రంగంలో అడుగు పెట్టిన తరువాత తన జీవితంలో జరిగిన విషయాలన్నీ అందరికి తెలుసని వెల్లడించింది. గత కొంత కాలంగా రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుంటూ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పవన్ నుంచి విడిపోయాక రెండో పెళ్లి అన్న టాపిక్ కూడా రేణూని తీవ్రంగానే ఇబ్బంది పెట్టడం ఇంతకుముందు చర్చనీయాంశమైంది.