మహేష్ నిర్మాణంలో రేణు దేశాయ్

0

మహేష్ బాబు నిర్మాణ సంస్థ ప్రారంభించి చాలా కాలం అయినా ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలకే సహ నిర్మాతగా వ్యవహరించడం లేదా సమర్పించడం చేస్తూ వచ్చాడు. మొదటి సారి అడవి శేషుతో ‘మేజర్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా గత ఏడాది కాలంగా చర్చల్లో ఉంది. సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చింది అనే అప్ డేట్ ఇప్పటి వరకు లేదు. ఈ సమయంలోనే మేజర్ లో కీలక పాత్రకు గాను రేణు దేశాయ్ ను సంప్రదించగా ఆమె ఓకే చెప్పిందట.

రేణు తనయుడు అకీరాకు అడవి శేషు అంటే చాలా అభిమానం. ఆ కారణంతో రేణు దేశాయ్ ఫ్యామిలీకి అడవి శేషు ఫ్యామిలీ ఫ్రెండ్ గా మారిపోయాడు. ఆ సన్నిహిత్యంతో మేజర్ చిత్రంలో నటించాల్సిందిగా అడవి శేషు కోరాడని.. పాత్ర నచ్చడంతో రేణు దేశాయ్ కూడా కాదనలేక పోయారంటూ టాక్ వినిపిస్తుంది.

సినిమాను మేజర్ ఉన్నికృష్ణన్ కు సంబంధించిన రియల్ లైఫ్ సంఘటనలతో రూపొందిస్తున్నారు. కథలో కీలకమైన ఒక పాత్రకు గాను రేణు దేశాయ్ ను తీసుకున్నారట. 15 నుండి 20 నిమిషాల పాటే రేణు దేశాయ్ స్క్రీన్ పై కనిపించనుందట. అయినా కూడా సినిమాలో ఆమె రోల్ అందరికి నచ్చే విధంగా ఉంటుందనే టాక్ వస్తోంది. బుల్లి తెరపై ఈమద్య కాలంలో తెగ సందడి చేస్తున్న రేణు దేశాయ్ కొన్నాళ్ల క్రితం సినిమాల్లో నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. అన్నట్లుగానే మేజర్ సినిమాకు ఓకే చెప్పినట్లుగా ఉంది. త్వరలో ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Please Read Disclaimer