రేణూజీ ఏంటీ ఈ రచ్చ

0

రైల్వే స్టేషన్ లో పాటలు పాడుతూ అడుక్కుని జీవనం సాగించే రేణూ మోండల్ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యి ఒక్కసారిగా సెలబ్రెటీ అయ్యింది. ఆమెకు సల్మాన్ ఖాన్ ఇల్లు బహుమానంగా ఇవ్వడంతో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ ఈమెకు తమ సినిమాల్లో పాటలు పాడే అవకాశం ఇస్తున్నారు. ఇక రియాల్టీ షోలు.. ఇంటర్వ్యూలు అంటూ ఈమె చాలా బిజీ అవ్వడంతో పాటు చాలా డబ్బు కూడా సంపాదిస్తుంది. ఈ సమయంలోనే ఆమెకు కాస్త అతి పెరిగి పోయిందని నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు.

ఇటీవల ఒక లేడీ ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు టచ్ చేసి పిలవడంతో ఎందుకు టచ్ చేస్తున్నావు అంటూ ఆమెపై సీరియస్ అయ్యింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టచ్ చేసి పిలిస్తే ఏం సమస్య అంటూ నెటిజన్స్ రేణూ మోండల్ ను ఇష్టానుసారంగా ట్రోల్స్ చేశారు. ఆ ట్రోల్స్ ఇంకా వేడి చల్లారకుండానే మళ్లీ ఈమెపై కొత్త ట్రోల్స్ ప్రారంభం అయ్యాయి. ఈమె మేకప్ కు సంబంధించిన ట్రోల్స్ సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి.

రేణూ మోండల్ ఇటీవల ఒక షో లో పాల్గొనేందుకు వెళ్లింది. అందుకోసం చాలా ఓవర్ గా మేకప్ అయ్యింది. చాలా ఖరీదైన మోడ్రన్ డ్రస్ ను వేసుకోవడంతో పాటు నెక్ నక్లెస్ ధరించి మరీ దారుణంగా మేకప్ చేయించుకుంది. రాణూ మోండల్ ఆ ఫొటోలు చూసిన తర్వాత నెటిజన్స్ రచ్చ రచ్చగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. రేణూ మోండల్ గురించి ఇష్టానుసారంగా మీమ్స్ చేస్తూ నవ్వు తెప్పిస్తున్నారు. నన్ బయోపిక్ కు రేణూ మోండల్ సరిగా సరిపోతుందని కొందరు బ్యూటీ క్రీమ్స్ వాడితే ఇలా ఉంటారంటూ కొందరు ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రెటీ స్టేటస్ వచ్చింది కదా అని మరీ ఇంతగా రెచ్చి పోతే ఏమాత్రం కరెక్ట్ కాదని.. రేణూ ఇకపై అయినా కాస్త జాగ్రత్తగా ఉండకుంటే ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా పోవడం కన్ఫర్మ్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Please Read Disclaimer