కామ్రేడ్ నోట `విరమణ` మాట!

0

విజయ్ దేవరకొండ నటించిన `డియర్ కామ్రేడ్` ఈ శుక్రవారం (26న) రిలీజవుతున్న సంగతి తెలిసిందే. పదిరోజులుగా కంటికి కునుకన్నదే లేకుండా ఊరూ వాడా తిరిగేస్తూ ప్రచారం చేస్తున్నాడు రౌడీ. ప్రమోషన్స్ లో రకరకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దేవరకొండకు ఓ మూడు ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. నటన విరమణ.. పెళ్లి .. లిప్ లాక్ ల గురించి ప్రశ్నలకు విజయ్ ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

నటనకు విరమణ ఎప్పుడు? అన్న ప్రశ్నకు సమాధానంగా … ఎప్పుడు రొటీన్ అని ఫీలవుతానో అప్పుడు నటన వదిలేస్తానని దేవరకొండ అన్నారు. “అది ఎప్పుడైనా కావొచ్చు. నేను ఇంతకుమించి ఇంకేదైనా చేయాల్సి ఉందని భావించినా నటన వదిలేస్తాను. పరమ రొటీన్ అని.. బోర్ ఫీలైనా వదిలేస్తాను“ అని అన్నారు.

ఇంతకీ పెళ్లెప్పుడు? అని ప్రశ్నిస్తే.. ఐదేళ్ల తర్వాతనే పెళ్లి. అప్పటికి నాకు 35 రావొచ్చు అని సమాధానం ఇచ్చారు. అయితే అప్పట్లో `నోటా` రిలీజ్ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న అడిగితే 30 వచ్చాక పెళ్లి చేసుకుంటానని దేవరకొండ అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిలా ఇంతలోనే మాట మార్చారు. సక్సెస్ తో పాటే పెళ్లిని విజయ్ దేవరకొండ వాయిదా వేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.

ఇక పెదవి ముద్దు గురించి ప్రశ్నిస్తే.. ఆన్ లొకేషన్ వంద మంది ముందు కథానాయికతో ముద్దు సన్నివేశం చేయడం చాలా ఇబ్బందికరమైన పని అని అన్నారు. నటుడు- నటి ఇద్దరూ సౌకర్యంగా ఉన్నారని అనిపించినప్పుడే కిస్ సీన్ చిత్రీకరించాలని అభిప్రాయపడ్డారు. వందల మంది క్రూ ముందు చేయడం సరికాదు. ఆ సమయంలో పరిమితంగానే టీమ్ ఉండాలి. ప్రేక్షకులకు చిరాకు పడేలా అలాంటి సన్నివేశాలు ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను నటిస్తున్న హీరో చిత్రంలో ఒక్క ముద్దు సీన్ కూడా ఉండదని.. కథ డిమాండ్ చేయలేదని వెల్లడించారు.
Please Read Disclaimer