ఆర్జీవీ బయోపిక్ ‘పప్పు వర్మ’

0

వివాదాల రామ్ గోపాల్ వర్మ- గీత రచయిత జోన్న విత్తుల రామలింగేశ్వరరావు మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. జోన్న విత్తులను ఉద్దేశించి వర్మ సెటైరికల్ గా మాట్లాడటం… ప్రతిగా జొన్న విత్తుల అదే స్థాయిలో కౌంటర్ వేయడం తెలుగు ప్రజల్లో వేడెక్కించింది. తాజాగా వర్మ కి పెద్దాయన స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ ఇద్దరి మధ్యా బాహాబాహీ ఇప్పుడు ఏకంగా ఆర్జీవీ బయోపిక్ కి దారి తీస్తోంది.

ఇన్నాళ్లు ప్రముఖుల జీవితాలపై సినిమాలు తీస్తూ హీటెక్కిస్తున్న ఆర్జీవీపైనే సినిమా తీస్తున్నారా? వర్మ వివాదాల జీవితాన్ని సినిమా తీసే ప్లాన్ జరుగుతోందా? అంటే .. ఆ పెద్దాయన వార్నింగును బట్టి అలానే అర్థం చేసుకోవాల్సి వస్తోంది. ఇంతకీ ఆయనేమన్నారు అంటే…

`”నేను నా పని నేను చేసుకుంటుంటే వర్మ వేలు పెట్టి మరీ కెలికాడు. నాపై లేనిపోని మాటలేంటి? అందుకే నేను మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు పప్పువి. బంగారు భవిష్యత్ ని నాశనం చేసుకుంటున్నావ్. నీకంటే అంతర్జాతీయ పప్పు ఎవడూ లేడిక్కడ. అందుకే పప్పు వర్మ టైటిల్ తో నీపై నేను సినిమా చేయబోతున్నారు. రెడీగా ఉండు“ అంటూ జొన్నవిత్తుల డైరెక్టుగా ఆర్జీవీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

“ఇష్టానుసారం మాట్లాడటం మనిషి లక్షణం కాదు. నీ బ్రతుకేంట” నువ్వు చూసుక’. మళ్లీచెబుతున్నా. పప్పు వర్మ తప్పెంటో తెలుసుకోవాలి. కాకినాడ వెళ్లి ఆయన కాళ్ల మీద పడాలి. నువ్వు ఎవర్ని అన్నావో ఆయన కాళ్లపైనా. లేదా నిను ఏం చేయాలే అదే చేస్తా. జైలుకు పంపుతా“ అంటూ జోన్న విత్తుల హెచ్చరించారు. ఇంతకీ ఆర్జీవీ బయోపిక్ జొన్నవిత్తుల తీస్తారంటారా?Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home