వర్మని నమ్మి మరోసారి మోసపోయారుగా…!

0

ఒకప్పుడు ఇండస్ట్రీకి ‘శివ’ ‘గాయం’ ‘సత్య’ ‘కంపెనీ’ ‘రంగీలా’ ‘సర్కార్’ వంటి సినిమాలు అందించిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ‘ఐస్ క్రీమ్’ ‘నగ్నం’ ‘క్లైమాక్స్’ వంటి సినిమాలు చూపిస్తున్నాడు. ఒకప్పుడు ఇండస్ట్రీకి కొత్తదారి చూపించిన సినిమాలు తీసి సెన్సేషనల్ డైరెక్టర్ అనిపించుకున్న ఆర్జీవీ ఇప్పుడు బూతు సినిమాల డైరెక్టర్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందుతున్న చాలామంది డైరెక్టర్స్ వర్మని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారే. అలాంటిది ఇప్పుడు వారే వర్మ క్రియేటివిటీని ప్రశ్నించే స్టేజికి దిగజారిపోయాడు. అయితే వివాదాస్పద దర్శకుడు.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్.. కాంట్రవర్సీ కింగ్ అని ఇలా ఎన్ని రకాల పేర్లు పెట్టి పిలుచుకున్నా వర్మ సినిమాలు మాత్రం ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు.

రామ్ గోపాల్ వర్మ సినిమాల కంటే ఆయన మాటలు ట్వీట్స్ బాగుంటాయని.. ట్రైలర్ లో చూపించడానికంటే ఎక్కువ సినిమాలో చూపించాడని కామెంట్స్ చేస్తున్నా ఆడియన్స్ మాత్రం అతని సినిమాలు ఆదరిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒక సినిమాలో మ్యాటర్ ఉన్నా లేకపోయినా దాంట్లో ఏదో ఉంది అని అనుకునేలా సినిమా ప్రమోషన్స్ తో అందరిని నమ్మిస్తాడు వర్మ. అందుకే 20 నిముషాలు కూడా లేని సినిమాకి 300 రూపాయలు టికెట్ ధర పెట్టినా.. 30 నిమిషాల సినిమాకి 10 డాలర్లు పెట్టినా జనాలు చూస్తారు. అయితే ఒకప్పుడు తన సినిమాల్లో క్రియేటివిటీ రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలోనైనా మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ చేయకపోతాడా అనే ఆశతో చూసే ఆడియన్స్ కూడా చాలా మంది ఉన్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ”పవర్ స్టార్” సినిమా కూడా ఆ కోవకే చెందింది. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాలో ఏదో ఉందని పబ్లిసిటీ చేస్తూ.. ఎక్సపెక్టషన్స్ పెట్టుకున్న వారందరిని మరోసారి మోసం చేసాడు వర్మ. ”పవర్ స్టార్” సినిమా ట్రైలర్ కి రామ్ గోపాల్ వర్మ స్పీచ్ జోడించినట్లే సినిమా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ట్రైలర్ చూసి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నాడని.. పవన్ ని ఓ రేంజ్ లో వర్మ ఆడుకున్నాడని సంబరపడిన యాంటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మరియు జనసేన పార్టీ వ్యతిరేకులు ఈ సినిమా చూసి చాలా డిజప్పాయింట్ అయ్యారు.

ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని వర్మ నెగిటివ్ గా చూపిస్తాడని భావించి ఈ సినిమాని వారు బాగా ప్రమోట్ చేసారు. అయితే తీరా సినిమా చూస్తే ఇప్పటి దాకా చూపించిన దానికి భిన్నంగా పవన్ కళ్యాణ్ కి ఫేవర్ గా ఈ సినిమాకి ముగింపు పలికాడు వర్మ. ఇక న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఈ సినిమా పట్ల పెద్దగా సంతృప్తిగా లేరు. అయినా సరే రామ్ గోపాల్ వర్మ నెక్స్ట్ సినిమా చూడటానికి అందరూ ముందే ఉంటారు. వర్మ అన్నా వర్మ సినిమా అన్నా ఓ మత్తు లాంటిది. అందుకే వర్మ ఎన్నిసార్లు ఫూల్స్ చేసినా మళ్ళీ ఫూల్స్ అవడానికి సిద్ధంగా ఉంటారు.