కుర్రహీరో కెరీర్ ని దెబ్బ కొడుతున్న ఆర్జీవీ

0

నిఖిల్ సిద్ధార్ధ్… సినీ ఇండస్ట్రీ లో ఎలాంటి సపోర్ట్ లేకుండా… తన కెరీర్ ని పక్కాగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న యంగ్ హీరో. శేఖర్ కమ్ముల `హ్యాపీ డేస్`తో ఎంట్రీ ఇచ్చినా ఆ తరువాత తనదైన ప్లానింగ్ తో కథల్ని ఎంచుకుంటూ విజయాల్ని సాధిస్తూ వచ్చాడు నిఖిల్. గత కొంత కాలంగా అతని ప్లాన్ బెడిసి కొడుతోంది. తనని కాకుండా తన పక్కన తిరుగుతున్న వారిని నమ్మి చేజేతులా కెరీర్ ని ఈ స్థాయి కి తెచ్చుకున్నాడు. తాజాగా నిఖిల్ నటించిన `అర్జున్ సురవరం` గత కొన్ని నెలలుగా ఇబ్బందు ల్లో ఇరుక్కుని రిలీజ్ కు నోచుకోవడం లేదు.

ఎట్ట కేలకు ఈ నెల 29న రిలీజ్కు డేట్ ఫిక్స్ అయింది. ఇదే సమయం లో వివాదాస్పద చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` చిత్రం రిలీజ్ కాబోతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ గానే ప్రభావం చూపించే లా కనిపిస్తోంది. దీని ధాటికి నిఖిల్ `అర్జున్ సురవరం` ఓపెనింగ్స్ పై భారీ గానే ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే నిఖిల్ కెరీర్ డేంజర్ లో పడినట్లేనని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ఫైనాన్స్ గొడవల కారణం గా నిఖిల్ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ నెల 29న రిలీజ్ డేట్ ప్రకటించారే కానీ ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఒకవేళ రిలీజ్ అని వార్యమైతే మాత్రం వర్మ దెబ్బ కు నిఖిల్ నిలబడటం కష్టమే.
Please Read Disclaimer