కేసీఆర్ గారు ఇది భావ్యమేనా : వర్మ

0

రామ్ గోపాల్ వర్మను మామూలు సమయంలోనే ఆపలేం. అలాంటిది న్యూ ఇయర్ పార్టీలో పాల్గొన్న తర్వాత అతడి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన చిన్నప్పటి నుండి పాత సంవత్సరం కు కొత్త సంవత్సరం కు ఎలాంటి తేడా ఉండటం లేదని.. అందుకే తాను న్యూ ఇయర్ వేడుకలు చేసుకోను అంటూ చెప్పుకొచ్చాడు. వర్మ ఎప్పుడు మాట మీద నిలవడు. మరోసారి అదే జరిగింది. నిన్న రాత్రి వర్మ న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నాడు.

న్యూ ఇయర్ వేడుక చేసుకుంటూనే వర్మ ట్విట్టర్ లో సందడి చేశాడు. న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకుంటుకున్నాను. దీనికి కారణం అమ్మాయిల కాళ్లు… దావుద్ ఇబ్రహీం మరియు ట్రంప్ అంటూ పిచ్చిగా ట్వీట్ చేశాడు. ఇలాంటి ట్వీట్స్ నిన్న రాత్రి వర్మ నుండి చాలానే వచ్చాయి. వర్మ ట్వీట్స్ లో చివరకు తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి కూడా ప్రస్థవన తీసుకు వచ్చాడు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు ఎంత సమయం అయినా.. ఎప్పుడైనా మందు తాగవచ్చు. కాని జనాలు మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు మందు తాగకుండా ఆక్షలు పెట్టడం మీకు న్యాయమా? భావ్యమా? అంటూ ప్రశ్నించాడు. మొత్తానికి వర్మ వోడ్కా పడటంతో ట్విట్టర్ లో ఆయన చేసిన ట్వీట్స్ వైరల్ అయ్యాయి. ఇటీవల నైనా గంగూలీ కాళ్లు మొక్కిన వర్మ వార్తల్లో నిలిచాడు. మళ్లీ ఇప్పుడు తన ట్వీట్స్ తో చర్చనీయాంశం అయ్యాడు.
Please Read Disclaimer