ప్రణయ్ హత్యపై వర్మ సినిమా.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల…!

0

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్ అయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. చరిత్రలో నిలిచిపోయిన సినిమా తీసాడని మెచ్చుకున్న నోర్లు కూడా చెత్త సినిమా తీసాడురా అని తిట్టుకునేలా చేస్తాడు. ఎప్పుడు సినిమా స్టార్ట్ చేస్తాడో.. ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో ఎవరికీ తెలియదు. సడెన్ సర్ప్రైజ్ లా ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ ట్రైలర్ అంటూ రిలీజయ్యే దాకా పబ్లిసిటీ చేసేసి.. వెంటనే నెక్స్ట్ సినిమాని రిలీజ్ కి సిద్ధంగా చేస్తాడు. ఇలా జెట్ స్పీడ్ తో సినిమాలు తీసే వర్మ కరోనా కారణంగా అందరిలాగే ఇంట్లోనే కూర్చుంటాడు అంటుకున్నారు. కానీ ఆయన మాత్రం ఏకంగా నాలుగు సినిమాలకి సంభందించిన అప్డేట్స్ ఇచ్చేసాడు. వర్మకి సినీ రాజకీయ ప్రముఖుల లైఫ్ ఇన్సిడెంట్స్ అయినా.. శృంగార తరాల లైఫ్ హిస్టరీ అయినా.. ఎన్కౌంటర్ చేయబడిన వ్యక్తుల జీవితాలైనా.. గ్యాంగ్ స్టర్ జీవిత కథ అయినా ఆయనకు కథా వస్తువే. వాటిని సినిమాగా రూపొందించిన క్రమంలో ఎన్ని వివాదాలు చెలరేగినా తాను అనుకున్నది సిల్వర్ స్క్రీన్ మీద బయట పెట్టేస్తాడు.

ఈ నేపథ్యంలో తాజాగా వర్మ తండ్రీ కూతుళ్ళు అమృత మారుతిరావుల కథ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ట్విటర్లో ప్రకటించారు. ‘మర్డర్’ అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రానికి ‘కుటుంబ కథా చిత్రమ్’ అనేది ఉప శీర్షికగా పెట్టాడు ఆర్జీవీ. మిర్యాలగూడకు చెందిన మారుతీరావు కేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మారుతీరావు కూతురు అమృత.. ప్రణయ్ అనే వ్యక్తిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకోవడం వల్ల తన పరువు పోయిందని అల్లుడిని దారుణంగా హత్య చేయించాడు. అయితే ఇటీవల మారుతీరావు కూడా ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఇప్పుడు ఈ ఘటన ఆధారంగా రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నాడు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ ను విడుదల చేసారు ఆర్జీవీ. ఆనంద్ చంద్ర ఈ ‘మర్డర్’కి దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ మరియు క్విటీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రధాన పాత్రలైన మారుతీరావుగా శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తుండగా అమృత పాత్రలో సాహితి నటిస్తోంది.
Please Read Disclaimer