ఆర్జీవీ నెక్ట్స్ టార్గెట్ మెగా ఫ్యామిలీ

0

ఇన్నాళ్లు నారా ఫ్యామిలీ .. నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఆర్జీవీ నెక్ట్స్ టార్గెట్ ఫిక్సయ్యింది. ఇకపై అతడు మెగా ఫ్యామిలీపై దృష్టి సారిస్తున్నాడు. మెగా ఫ్యామిలీ పొలిటికల్ డ్రామాని వండి వార్చేందుకు అతడు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఆ మేరకు అధికారికంగా తన ట్విట్టర్ ద్వారా వివరాల్ని అందించాడు.

29 అక్టోబర్ 9.36 ఏఎం నా తదుపరి సినిమాని ప్రకటిస్తున్నా. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు తర్వాత నా సినిమా టైటిల్ MEGA FAMILY అంటూ సెన్సేషన్ కి తెర తీశాడు. దీనిని బట్టి మెగా ఫ్యామిలీ కథను అతడు వండి వారుస్తున్నాడని అర్థమవుతోంది. ఆర్జీవీ తొలి నుంచి మెగా హీరోలపై సెటైర్లు వేస్తూనే ఉన్నాడు. అభిమానిని అంటూనే తనదైన శైలిలో వ్యంగ్యంగా సెటైర్లు వేస్తూ మెగా ఫ్యాన్స్ ని రెచ్చగొడుతూనే ఉన్నాడు. ముఖ్యంగా చిరంజీవి.. పవన్ కల్యాణ్ లపై అతడు వేస్తున్న సెటైర్లు ఫ్యాన్స్ కి ఇర్రిటేషన్ కలిగిస్తున్నాయి. రాజకీయాల్లో మెగా హీరోల వైఫల్యంపైనా అతడు సెటైర్ వేయబోతున్నాడా? లేక ఏ కోణంలో అతడు ఎటాక్ చేయబోతున్నాడు? అన్న ఉత్కంఠ పెరిగింది.

ఇప్పుడు డైరెక్టుగా సినిమానే తీస్తున్నా! అంటూ ప్రకంపనాలే సృష్టిస్తున్నాడు. దీంతో ఆర్జీవీ వర్సెస్ మెగా ఫ్యామిలీ! ఎపిసోడ్స్ ఫిక్సయినట్టే. నందమూరీస్ ని.. నారా వారిని డైరెక్టుగానే ఎటాక్ చేస్తున్న ఆర్జీవీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోల్ని ఎలా టార్గెట్ చేయబోతున్నారు? అన్న ఉత్కంఠ రెట్టింపైంది. మరి కాసేపట్లోనే ఈ సినిమాకి సంబంధించిన వివరాలు రానున్నాయి కాబట్టి.. అంతవరకూ జస్ట్ వెయిట్.
Please Read Disclaimer