హైదరాబాద్ దిశ ఘటనపై ఆర్జీవీ సినిమా

0

వివాదాలతో సంచలనాలకు తెర తీసే ఆర్జీవీ మరో సంచలనానికి రెడీ అవుతున్నాడా? అంటే అవుననే తాజా సమాచారం. ఇటీవల వరుసగా కాంట్రవర్శీలతో అంటకాగుతున్న వర్మ.. ఈసారి సామాజిక బాధ్యత అవేర్ నెస్ కి సంబంధించిన కథతో సినిమాని తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అది ఒక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకున్న సినిమా. దేశవ్యాప్తంగా సంచలనమైన ఘటనపై సినిమా. అదేమిటో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. హైదరాబాద్ లో అత్యంత పాశవికంగా హత్యాచారానికి గురైన దిశ ఘటనపై ఆర్జీవీ సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ మేరకు ట్విట్టర్ లో ఆర్జీవీ చేసిన ప్రకటన వేడెక్కిస్తోంది. ఈ సినిమాకి టైటిల్ ని కూడా ఆర్జీవీ ప్రకటించేశారు. `స్కారీ లెస్సన్` అంటూ ఒక టైటిల్ ని ఆయన పోస్ట్ చేశారు. ఇక ఆ ఘటన జరిగిన స్థలాన్ని విజిట్ చేసారో ఏమో వర్మ ఆ ఇన్సిడెంట్ ప్లేస్ కి సంబంధించిన ఫోటోల్ని కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాల్ని వెల్లడించనున్నారట.

దిశ ఇన్సిడెంట్ పూర్వాపరాల్లోకి వెళితే.. హైదరాబాద్ శివార్ల లో దిశ (ప్రియాంక రెడ్డి) ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలమైందో తెలిసిందే. నలుగురు మృగాళ్లు అత్యంత పాశవికంగా ప్రియాంకరెడ్డిని అత్యాచారం చేసి తగులబెట్టి చంపేసారు. దీంతో లోకం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అటుపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం అంతకు మించి సంచలనమైంది. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ సీపీ సజ్జనార్ ని రంగంలోకి దిగి ఆ నలుగురినీ అదే స్పాట్ లో ఎన్ కౌంటర్ చేయించడం సంచలనమైంది. పారిపోతున్న దోషుల్ని కాల్చి చంపాల్సి వచ్చిందని ప్రకటించారు పోలీసులు. అత్యాచారంకు ముందు జరిగిన సన్నివేశం ఏకంగా ఓ సినిమా స్టోరీనే తలపిస్తుందనడంలో సందేహమేం లేదు.

గచ్చిబౌలిలోని ఆసుపత్రి కి ట్రీట్ మెంట్ కు బయలు దేరిన దిశ యాక్టివా పంక్చర్ అవ్వడం సరిగ్గా టోల్ ప్లాజా వద్ద మద్యం సేవిస్తున్న నలుగురు నిందుతులు ఆమెను రెక్కి వేసి ట్రాప్ చేయడం..అటుపై నిర్జన ప్రదేశంలో అత్యాచారం అనంతరం లారీలో కి ఎక్కించి నిర్మానుష ప్రదేశంలో దహనం చేయండం ..అటుపై పోలీసుల విచారణ… సజ్జనార్ టీమ్ సీన్ రీకన్ స్ట్ర క్షన్ కోసం దిశను చంపిన స్పాట్ కే ఆ నలుగురీ తీసుకెళ్లి పారిపోతుంటే ఎన్ కౌంటర్ చేయడం..ఇలా ప్రతీ సన్నివేశం ఓ సస్పెన్స్ థ్రిల్లర్ నే తలపించింది. తాజాగా ఇప్పుడు ఇదే ఘటనను సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాగా చేయడానికి రెడీ అవుతున్నాడు.

దీంతో దిశ ఘటనను కళ్లకు గట్టే ప్రయత్నమే మొదలైంది. వాస్తవ సంఘటనలు ఆధారంగా సినిమాలు చేయడం వర్మకు కొట్టిన పిండి అని చెప్పాల్సిన పనిలేదు. జరిగిన సన్నివేశాన్ని కళ్ల ముందు ఉన్నది ఉన్నట్లుగా దించేయడమే స్పెషాలిటీ అదే. ఆయన తాజా అనౌన్స్ మెంట్ తో టాలీవుడ్ సహా బాలీవుడ్ మీడియా కూడా వర్మ పై అటెన్షన్ పెట్టింది. అలాగే నిర్భయ హత్య కేసు లో దోషులు గా ఉన్న వారి తరుపున వాదిస్తోన్న న్యాయవాది ఆర్. పి సింగ్ పై వర్మ నేటి ఉదయం నుంచి తుటాల్లాంటి ట్వీట్లు వదులుతున్నాడు. ఇలాంటి వాళ్లు ఉన్నంత కాలం న్యాయం ఎలా జరుగుతుంది! అంటూ వర్మ ప్రశ్నించడం విశేషం.
Please Read Disclaimer