పవన్ జూ.ఎన్టీఆర్ పై వర్మ షాకింగ్ కామెంట్స్

0

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా జనసేనాని హీరో పవన్ కళ్యాణ్ తోపాటు మరో హీరో జూ.ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు వేశారు. తాజాగా వర్మ మాట్లాడుతూ.. నా దృష్టిలో బెస్ట్ సీఎం అంటూ ఎవరూ లేరని.. ఫ్యుచర్ సీఎం అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చాడు. అతడి గురించి ఒక్క వర్డ్ లో చెప్పాలంటే వెరీ టఫ్ అని యూనిక్ .. వన్ పీస్ అంటూ పొగిడేశాడు. పవన్ ఓన్లీ సింగిల్ పీస్ అంటూ ప్రశంసించాడు. ఇక మెగా స్టార్ చిరంజీవి సినిమాల పరంగా తనకు చాలా ఇష్టమని.. రాజకీయంగా మాత్రం కాదని వర్మ తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ బెటర్ దాన్ సీనియర్ ఎన్టీఆర్ అంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా స్టార్ హీరోల మీద.. వారి భవిష్యత్ మీద వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశమయ్యాయి. వివాదాలకు కేంద్ర బిందువైన వర్మ తాజాగా హీరోల గురించి పాజిటివ్ గా స్పందించడం విశేషం.
Please Read Disclaimer