ప్రస్తుతం ఇండస్ట్రీలో ‘మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్’ ఆయనేనట!

0

వివాదాల రాంగోపాల్ వర్మ సొంతంగా ఆన్ లైన్ థియేటర్ను ప్రారంభించి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదివరకే ‘కరోనా నన్నేం చేయలేదు. మహా అయితే థియేటర్లను మూసేయిస్తుందేమో కానీ.. నా ఆలోచనలు కాదు’ అంటూ ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అదే ‘శ్రేయాస్ఈటి’ పేరుతో ఏకంగా తన సొంత యాప్ ప్రారంభించి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు. ప్రస్తుతం అందరూ నెట్ ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ హాట్ స్టార్ అని ఓటీటీల వైపు పరుగులు పెడుతుంటే.. వర్మ పాయింట్ క్యాచ్ చేసి ఆర్జీవీ వరల్డ్ థియేటర్ను ఓపెన్ చేసాడు. దేశం మొత్తం సినిమా థియేటర్లు మూత పడటంతో.. శృంగార తార మియా మాల్కోవాను పెట్టి ‘క్లైమాక్స్’ తీసి విడుదల చేసాడు. ఆర్జీవీ వరల్డ్ లో క్లైమాక్స్ సినిమా చూడాలనుకున్న ప్రతీ ప్రేక్షకుడి నుంచి వంద రూపాయలు వసూల్ చేశాడు. ఆ సినిమా సర్వర్ క్రాష్ అయ్యేంత రెస్పాన్స్ తో వసూళ్ల వర్షం కురిపించింది.

ఇక వెంటనే వర్మ.. ‘నగ్నం’ అనే పేరుతో మరో షార్ట్ ఫిల్మ్ విడుదల చేసాడు. ట్రైలర్లతోనే ఆసక్తిని రేపిన వర్మ.. ఈసారి నగ్నం టికెట్ ధరను 2 వందల రూపాయలుగా ఫిక్స్ చేసాడు. ఇటీవలే విడుదల అయిన నగ్నం షార్ట్ ఫిల్మ్ ఇప్పటివరకు 40వేల మంది వీక్షించారట. ఒక్కొక్కరు 200 చెల్లించారు కాబట్టి దాదాపు 80లక్షల వసూల్ అయినట్లు సమాచారం. పూర్తి శృంగార భరితంగా తెరకెక్కిన నగ్నం.. ఓ బి గ్రేడ్ షార్ట్ ఫిల్మ్ అని చెప్పవచ్చని అంటున్నారు. అయితే ఎలా అయితే ఏంటి వర్మ కరోనా టైంలో కూడా లాభాలు గడిస్తున్నాడని అంటున్నారు మరికొందరు. ఇక ఇండస్ట్రీలో చాలామందికి రాంగోపాల్ వర్మ మీద ఈర్ష కలుగుతుందట. ఎందుకంటే జనాల అట్టెన్షన్ తో బాగానే ఆర్థిక లాభాలు పొందుతున్నాడు అని. ఆర్జీవీ ఎవరి మాటలు పట్టించుకోడని తెలిసిందే. తాజాగా.. “ప్రస్తుతం కరోనా టైంలో నేనే మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫిల్మ్ మేకర్.. మరో విషయం ఏంటంటే ఆగస్టులో మర్డర్ సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు..” ప్రకటించాడు. వర్మ ట్వీట్లతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తుందని చెప్పవచ్చు.
Please Read Disclaimer