రాజమౌళిని ట్రంప్ రిక్వెస్ట్ చేయాలన్న వర్మ!

0

అగ్గిపుల్ల…కుక్కపిల్ల….సబ్బు బిళ్ల …కాదేదీ కవితకనర్హం అన్నది ఔట్ డేటెడ్ కొటేషన్….సెక్స్.. .సినిమాలు… రాజకీయాలు.. కావేవి వర్మ విమర్శలకనర్హం…అన్నది అప్డేటెడ్ కొటేషన్. టాలీవుడ్ బాలీవుడ్లలో మోస్ట్ కాంట్రవర్షియల్ డైరెక్టర్గా పేరున్న వర్మ…అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన పై సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వర్మ తన ట్వీట్లలోకి దర్శక ధీరుడు జక్కన్నను కూడా లాగాడు. గ్రాఫిక్స్ మాయాజాలం ఉపయోగించి తనకోసం ఓ వీడియో చేయాల్సిందిగా జక్కన్నను ట్రంప్ రిక్వెస్ట్ చేయాలని వర్మ పంచ్ వేశాడు. లక్ష మందిని కోటిమందిలా చూపించే గ్రాఫిక్స్ వీడియోను ట్రంప్నకు రాజమౌళి గిఫ్ట్ గా ఇవ్వాలని వర్మ చమత్కరించాడు.

ట్రంప్ ఇండియా టూర్కు అన్ని కోట్లు ఖర్చు చేయడంపై విమర్శలు గుప్పించిన వర్మ….తనను చూసేందుకు లక్ష మంది వచ్చారో …కోటి మంది వచ్చారో ట్రంప్ లెక్కబెట్టి మరీ రివేంజ్ తీర్చుకుంటాడని సెటైర్లు వేశాడు. ఒకవేళ మోడీ చెప్పినట్లు కోటి మంది రాలేదని ఆ లెక్కలో తేలితే…ట్రంప్ ప్రతీకారం తీర్చుకుంటాడని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇక అహ్మదాబాద్లో మురికి వాడలు కనిపించకుండా కట్టిన గోడపై వర్మ సెటైర్ వేశాడు. అసలు మురికివాడల వ్యూ ఇదని….ట్రంప్ వ్యూ ఇదని ఫొటోలతో సహా ట్వీట్ చేశాడు. ఏదేమైనా వర్మ దెబ్బకు ట్రంప్ కూడా బలై పోయాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-