కమ్మనైన రిలీజ్.. ఆర్జీవీ సీక్రెట్ ప్లాన్ లీక్!

0

రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` ట్రైలర్ తో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వివాదాలు వేడెక్కిస్తున్నా తనపని తనదే అన్నట్టుగా వర్మ వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్తున్నాడు. దీంతో సినిమా రిలీజ్ వ్యవహారంపై ఆసక్తి నెలకొంది. కానీ వర్మ విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. ప్రతిసారీ ముందే రిలీజ్ తేదీని ప్రకటించి హీటెక్కించేవాడు. కానీ ఈసారి ఆ విషయంలో సస్పెన్స్ మెయింటెన్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్- టైగర్ కంపెనీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదీని వర్మ ఫిక్సయిపోయాడని తెలిసింది. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి సడెన్ షాకివ్వనున్నాడని సమాచారం. ఈనెల 10వ తేదీకి తొలి కాపీ సిద్దమవుతుందని తెలిసింది. అనంతరం వర్మ తనదైన మార్క్ ప్రమోషన్ తో చిత్రాన్ని మరింతగా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయనున్నాడట. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఆ వేడుకకు వర్మ తన సన్నిహిత హీరోలు .. దర్శకనిర్మాతలను అతిథులుగా ఆహ్వనించనున్నట్లు సమాచారం. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఓవైపు ఆర్జీవీ రిలీజ్ ప్లాన్ లో సీక్రసీ మెయింటెయిన్ చేస్తుంటే మరోవైపు వైరి వర్గాలు బరిలో దిగి ఈ సినిమా రిలీజ్ ని ఆపాలని కుట్ర పన్నుతున్నాయట. టాలీవుడ్ హిస్టరీలో మునుపెన్నడూ లేనంతగా కులాల్ని కెలుకుతున్న వర్మకు బుద్ధి చెప్పాలన్న సీక్రెట్ ఎజెండాతో కొందరు గట్టిగానే కాపు కాసుకుని కూచున్నారట. మరి మునుముందు రిలీజ్ విషయమై ఎలాంటి ట్విస్టులుంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇంతకుముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో తలెత్తిన డైలమానే ఈసారి కూడా పునరావృతం అవుతుందా? అసలు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు రిలీజ్ అవుతుందా అవ్వదా? అంటూ ఫిలింమీడియాలోనూ ఆసక్తిగా మాట్లాడుకోవడం వేడెక్కిస్తోంది.
Please Read Disclaimer