ఫ్యూచర్ సీఎం పవన్ కళ్యాణ్ : సెన్సేషనల్ డైరెక్టర్

0

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎవరేం అనుకుంటే నాకేంటి.. ఉన్నదున్నట్లు మాట్లాడతా అంటూ వివాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక తనకు ఇష్టమొచ్చిన వారిని ట్వీట్స్ తో గిల్లుతూ విమర్శలను ఎదుర్కుంటూ ఉంటారు. ఇక మెగా ఫ్యామిలీ అంటే చాలు అందరికంటే ముందు నేనున్నా అంటూ కామెంట్స్ చేస్తుంటారు. ముఖ్యంగా చిరంజీవి – పవన్ కళ్యాణ్ – నాగబాబు లపై డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్వీట్స్ చేస్తూ మెగా అభిమానుల ఆగ్రహానికి గురవుతుంటారు. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వారిపై పాజిటివ్ గా స్పందిస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఆర్జీవీ ప్రస్తుతం ‘నగ్నం’ అనే సినిమా తెరకెక్కించారు. దీంతో పాటు రియల్ ఇన్సిడెంట్ ని ఆధారంగా చేసుకొని ‘మర్డర్’ అనే సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాల విశేషాలను తెలియజేస్తూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ లపై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు.

రామ్ గోపాల్ వర్మ వర్మ మాట్లాడుతూ చిరంజీవిని తాను సినిమాల పరంగా ఇష్టపడతాను కానీ రాజకీయ నాయకుడిగా కాదని చెప్పారు. ఇక తన దృష్టిలో బెస్ట్ సీఎం ఎవరు అని సదరు యాంకర్ ప్రశ్నించగా.. ఎవరూ లేరన్న ఆర్జీవీ ‘ఫ్యూచర్ సీఎం మాత్రం పవన్ కళ్యాణ్’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా ”వన్ వర్డ్లో పవన్ గురించి చెప్పాలంటే.. వెరీ టఫ్.. యునిక్.. వన్ పీస్’’ అంటూ పొగిడేశారు వర్మ. ‘వరల్డ్ లో పవన్ ఓన్లీ వన్ పీస్’ అని ప్రశంసించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ బెటర్ ధ్యాన్ సీనియర్ ఎన్టీఆర్ అంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఎప్పుడూ మెగా హీరోలను టార్గెట్ చేస్తూ ఏదొక కాంట్రావర్సీతో హైలైట్ అయ్యే వర్మ ఈసారి పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ గా స్పందించడం అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతేకాకుండా ఏకంగా ‘పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ సీఎం’ అంటూ ఆకాశానికి ఎత్తేసారు. వర్మ ఏమి చేసినా ఏ కామెంట్ చేసినా దాని వెనుక నిగూఢ అర్థం ఉంటుంది. మరి ఇప్పుడు పవన్ ని పొగడ్తలతో ముంచెత్తడానికి ఆర్జీవీ వెనుక ఏదైనా బలమైన కారణం ఉందేమో…!
Please Read Disclaimer