కొంటె కోరికతో యాంకరమ్మకి షాక్ ఇచ్చిన వర్మ.. ఏకంగా బికినీలో..!

0

రాంగోపాల్ వర్మ అంటే ప్రత్యేకమైన మైండ్ సెట్ తో తయారయ్యాడా.. లేక ఆయన కావాలనే అలా తింగరిగా మాట్లాడతాడా.. అనేది అందరిలో ఒక సందేహం. కానీ రాంగోపాల్ వర్మ అంటే అందరికి తెలిసిన ఓ తిక్క మనిషి. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. అది ఏదైనా.. ఎవరినైనా ముఖం మీదే అడిగేస్తాడు. సరే కుదరదు అంటే కూడా పెద్దగా పట్టించుకోడు. కానీ ప్రతీ ఇంటర్వ్యూలో వివాదాస్పద సమాధానాలు లేదా దిమ్మతిరిగే కోరికలు బయట పెడతాడు. ఇంటర్వ్యూలలో సంచలనం సృష్టించడం కేవలం రాంగోపాల్ వర్మకే చెల్లిందని చెప్పవచ్చు. తాజాగా యూట్యూబ్ ఛానల్ యాంకర్ వర్మను ఇంటర్వ్యూ చేస్తూ కొన్ని కొంటె ప్రశ్నలు కూడా అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలకు ఆర్జీవీ మతిపోయే సమాధానాలు ఇచ్చాడు.

ఆమె ఇలా అడిగింది.. “రీసెంట్ టైంలో మీకు ఏ అమ్మాయిని చూస్తూ వావ్ అని అనిపించింది? అంటే.. చాలామందిని అందులో నువ్వు కూడా అనేశాడు వర్మ. అతని ఆన్సర్కి తెగ సిగ్గుపడి థాంక్స్ చెబుతూ.. మరో కొంటె ప్రశ్న అడిగింది. ‘మనిషికి కోరికలు అనేవి కామన్.. మీకు ఇప్పటి వరకూ తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా’? అని వర్మను అడిగితే.. ‘నాకు ఒక కోరిక కలిగింది అంటే తీర్చుకోకుండా ఉండటం అనేది ఇప్పటి వరకూ జరగలేదు. నాకు ఒక కోరిక కలిగింది అంటే వెంటనే తీర్చేసుకుంటా. ఎనీ టైమ్ కోరికల్ని నేను ఎంజాయ్ చేస్తూ ఉంటా.. అందుకే మళ్లీ మళ్లీ తీర్చుకుంటూ ఉంటా.

ఒకవేళ నా కోరిక తీరనిది అని తెలిస్తే దాన్ని వెంటనే మర్చిపోతా. దాన్ని పట్టుకుని వేలాడను” అన్నాడు. అంతేగాక కొనసాగింపుగా.. “నిజానికి నిన్ను(యాంకర్) బికినీలో చూడాలని ఉంది.. నేను నీకు ఆఫర్ ఇస్తా బికినీలో ఓ రోల్ చేయడానికి నీకు ఇష్టమైతే.. నువ్ నో అంటే ఆ కోరికను మర్చిపోతా” అంటూ మనసులో ఉన్న కోరికను సూటిగా చెప్పేశాడు. ఇక వర్మ జవాబులకు యాంకర్ కి నిజంగా దిమ్మతిరిగిందని చెప్పాలి. కానీ ఆర్జీవీ కొంటె సమాధానాలను తను కూడా ఎంజాయ్ చేసిందని అర్ధమవుతుంది. యాంకర్ల మీద కొంటె బాణాలు విసరడం వర్మకి కొత్తేమి కాదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Please Read Disclaimer