రంగీలా పేరును చెడగొట్టకు ఆర్జీవీ

0

ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన `రంగీలా`(1995) సంచలనాల గురించి తెలిసిందే. ఊర్మిళ అనే గొప్ప నటిని వెండితెర వినీలాకాశం లో ధృవ తారగా నిలబెట్టిన మేటి దర్శకుడి గా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. అయితే అంత గొప్ప పేరును ఆర్జీవీ ఇప్పుడిలా ఎందుకు చెడగొట్టుకుంటున్నాడు? అంత గ్రేట్ క్లాసిక్ పేరును పదే పదే ఎందుకు ప్రస్థావిస్తున్నారు? అంటూ అభిమానులు ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్జీవీ గత కొంతకాలంగా తనది కాని `బ్యూటిఫుల్` అనే సినిమాకి సంబంధించిన ప్రచారం చేస్తున్నారు. ఇంతకుముందు `బ్యూటిఫుల్` టీజర్ ని విడుదల చేశారు. ఆ టీజర్ ఆద్యంతం కథానాయిక నైనా గంగూలీ మేని విరుపుల్ని .. బీచ్ లో అందాల ఆరబోతను ఎలివేట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే రంగీలాతో పోలిక పెడుతూ ఆ సౌండ్ లేని వీడియోకి ప్రచారం చేయడమే అభిమానుల కు ఏ మాత్రం నచ్చలేదు. నైనా అందంగా ఉంది.. హాట్ గా ఉంది. కానీ ఊర్మిళ స్థాయిలో చేయలేదు!! అంటూ విరుచుకుపడ్డారు. 1995 క్లాసిక్ హిట్ రంగీలాకు వీరాభిమానులు ఉన్నారు. అలాంటి సినిమా తో పోలుస్తూ బ్యూటిఫుల్ అనే సినిమా కి ప్రచారమేమిటి? అంటూ తిట్టేశారు కొందరైతే. బీచ్ లో సరిగంగ స్నానాలు పెదవి ముద్దులు చూపిస్తూ రంగీలా తీపి జ్ఞాపకం ఇదేనంటారా? అంటూ చెడుగుడు ఆడేశారు.

ఏదైతేనేం.. ఆర్జీవీ అసిస్టెంట్ అగస్త్య మంజు రూపొందిస్తున్న బ్యూటిఫుల్ చిత్రానికి కావాల్సినంతా ఉచిత పబ్లిసిటీ దక్కింది. పార్థ్- నైనా జంటగా రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రమిదని చెబుతున్నారు. అయితే ఈ సినిమా ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్నది ఇంకా చెప్పాల్సి ఉంది. ఇక ఆర్జీవీ మరో సారి నైనా అందాల ఎలివేషన్ కి సంబంధించిన ఓ రెండు ఫోటోల్ని షేర్ చేసి మరోసారి రంగీలా ను గుర్తు చేయడం తో తిరిగి ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. రోడ్ పై రంగీలా మార్క్ ఫోజులిస్తే అంత పెద్ద హిట్టొస్తుందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు సామాజిక జనం.
Please Read Disclaimer