ట్రోల్స్ : వర్మ మరీఇంత చీప్ గా చేస్తాడనుకోలేదు!

0

రామ్ గోపాల్ వర్మ కొన్ని రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన క్లైమాక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వంద రూపాయలు టికెట్టు పెట్టినా కూడా దాదాపుగా మూడున్నర లక్షల మంది ఆ సినిమాను చూశారట. భారీ ఆదాయం సంపాదించిన వర్మకు ఇంకా ఆశ కలిగినట్లుంది. ఈసారి నగ్నం అనే సినిమా తీసి దాన్ని రెండు వందల రూపాయల టికెట్ పెట్టి మరీ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.

ఇప్పటికే వర్మ తన మార్క్ నుండి బయటకు వచ్చి బూతు సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు అది మరింత శృతి తప్పింది. రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రంలో పశ్చిమ గోదావరి దేవరపల్లి నుండి ఈ సినిమా వస్తుంది అంటూ ఈ ఫొటోను ట్వీట్ చేశాడు. ఇందులో మహిళ మరీ అసభ్యంగా ఉండటంతో వర్మ ఇంతగా దిగజారి మరీ సినిమాను తీస్తున్నాడా అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు తీసిన వర్మ ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు అంటూ ఆయన అభిమానులు స్వయంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డబ్బు కోసమా లేదా పబ్లిసిటీ కోసమా అంటూ ఇలాంటి సినిమాలపై వర్మ అభిమానులు స్వయంగా ట్రోల్స్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్ లు యూత్ ను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా కారణంగా చెడిపోతున్న యువత వర్మ ఇలాంటి సినిమాలు తీస్తే వారి పరిస్థితి ఏంటీ అనే ఆందోళనను కొందరు వ్యక్తం చేస్తున్నారు. వర్మ నీకు ఇది తగదు అంటూ కొందరు హెచ్చరిస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా కూడా వర్మ మాత్రం తాను అనుకున్నది చేసుకుంటూ పోవడం మాత్రమే కాకుండా త్వరలో విడుదల చేసేందుకు కూడా సిద్దం అవుతున్నాడు.
Please Read Disclaimer