పవన్ ‘కాపు నేస్తం’ ప్రకటించిన రోజే నేను ‘పవర్ స్టార్’ ప్రకటించేశా..!

0

రామ్ గోపాల్ వర్మ… సినీ ఇండస్ట్రీలో ఈ పేరే ఓ సంచలనం. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే వర్మ ఎప్పుడు ఏమి చేస్తాడో ఎవరీ తెలియదు. ఎప్పుడు ఎవరిని ఏ రకంగా గిల్లాలో ఆయనకు తెలిసినంత ఎవరికీ తెలియదని చెప్పవచ్చు. ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ మీద మాట్లాడటం దాన్ని వివాదాస్పదం చేయడం వర్మ నుంచే చూసి నేర్చుకోవాలి. తనకు గిట్టని వాళ్లపై ఏదో కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలవడం వర్మకు ముందు నుంచి ఉన్న అలవాటు. ఇక మెగా ఫ్యామిలీ అంటే చాలు అందరికంటే ముందు నేనున్నా అంటూ కామెంట్స్ చేస్తుంటారు వర్మ. ముఖ్యంగా చిరంజీవి – పవన్ కళ్యాణ్ – నాగబాబు లపై ప్రత్యక్ష పరోక్ష ట్వీట్స్ చేస్తూ మెగా అభిమానుల ఆగ్రహానికి గురవుతుంటారు. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు ఆర్జీవీ. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ టైటిల్ ‘పవర్ స్టార్’ అని.. ఈ సినిమాలో పీకే ఎమ్మెస్ ఎన్ బీ టీఎస్ మరియు ఓ రష్యన్ మహిళ – నలుగురు పిల్లలు – ఎనిమిది గేదెలు మరియు ఆర్జీవీ నటించనున్నారని ట్వీట్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వర్మపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

కాగా ఇప్పుడు అగ్నిపై ఆజ్యం పోసినట్లు మరో ట్వీట్ తో ముందుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ”పవన్ కళ్యాణ్ ‘కాపు నేస్తం’ ను ప్రకటించిన రోజునే నేను ‘పవర్ స్టార్’ సినిమాను ప్రకటించాను. ఇది డెస్టినీ మాత్రమే. దీంట్లో నా వైపు నుండి ఎలాంటి కుట్ర లేదు.. నాకు ‘కాపు నేస్తం’ గురించి ఏమీ తెలియదు. అలానే ‘పవర్ స్టార్’ గురించి ఆయనకు తెలియదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇది నాతో సహా అతని అభిమానులందరిపై ప్రమాణం చేసి చెప్తున్నాను” అని ట్వీట్ చేసారు. ఇలా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వర్మ అటెన్షన్ కోరుకుంటున్నారని.. అతని సినిమాలు ఎవరూ చూడటం లేదని కనీసం మీడియాలో అయినా తన గురించి మాట్లాడుకుంటారని ఆర్జీవీ అనుకుంటున్నాడని పవన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వర్మ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Please Read Disclaimer