సుశాంత్ స్టాఫ్ మరియు నమ్మకస్తుడైన బాడీగార్డుని రియా తొలగించిందా…?

0

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ కేసుని సీబీఐకి అప్పగించాలని చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సుశాంత్ తండ్రి కృష్ణ కిషోర్ సింగ్ (కేకే సింగ్) పాట్నాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఫిర్యాదు చేసారు. దీంతో రియాపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని విచారణ నిమిత్తం ముంబై పంపించారు. రియాపై కేసు నమోదు చేయడంతో బాలీవుడ్ లో కొన్ని వర్గాలు ఆమెకు అండగా నిలుస్తూ న్యాయ చట్టపరమైన సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేసారని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా రియా చక్రవర్తి సుశాంత్ మరణానికి ఎలా కారణమైంది అనే కోణంలో పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

కాగా సుశాంత్ సింగ్ తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారని తెలియగానే రియా చక్రవర్తి సభ్యులు వెంటనే పలువురు లాయర్లను సంప్రదించారని.. ఆర్థిక లావాదేవీలు అవకతవకలపై ఆరోపణలు చేయడంతో ప్రముఖ ఆడిటర్ల సలహాలు కూడా తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ఆరోపణలు చేస్తున్నారు. సుశాంత్ సింగ్ తో రియా చక్రవర్తి అనుసరించిన విధానం కూడా ఆమెపై అనుమానాలు రేకేత్తేలా చేస్తున్నాయని.. మార్చి 8న సుశాంత్ కు నమ్మకస్తుడైన బాడీగార్డును రియా తొలగించడంతో పాటు సుశాంత్ స్టాఫ్ ని కూడా మార్చేసిందని.. ఈ క్రమంలో సుశాంత్ ను ఒంటరివాడిననే ఫీలింగ్ కలిగించేందుకు కుట్రలు పన్నారని ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా డిప్రెషన్ పేరుతో సుశాంత్ కు మోతాదుకు మించి మెడిసిన్స్ అందించి మానసికంగా శారీరకంగా సుశాంత్ ని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేశారని ఆమెపై ఆరోపణలు చేస్తుండటం మరింత చర్చనీయాంశమైంది. సుశాంత్ ఆర్థిక లావాలాదేవీలపై విచారణ చేపట్టమని.. అతని అకౌంట్ నుండి పెద్ద మొత్తంలో వేరే అకౌంట్స్ కి బదిలీ అయ్యాయని.. దీనిపై రియా పాత్రను ప్రశ్నిస్తూ కేకే సింగ్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో రియా ఆర్థిక విషయాలపై.. సుశాంత్ తో మొదలుపెట్టిన బిజినెస్ వ్యవహారాలపై పాట్నా పోలీసులు ఆరా తీసే అవకాశాలున్నాయి. ఇక రియా సోదరుడు షోవిక్ చక్రవర్తితో సుశాంత్ కలిసి ప్రారంభించిన కంపెనీలు.. వాటికి రియా మరియు షోవిక్ చక్రవర్తి డైరెక్టర్లుగా ఉన్నట్లు.. ఈ కంపెనీలకు సుశాంత్ మాత్రమే పెట్టుబడిదారుడుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కేసు విచారణ పూర్తయితే కానీ రియాపై వస్తున్న ఆరోపణలు అనుమానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.