త్రివిక్రమ్.. మహేష్ కి చెడిందా?

0

సంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్ మేకర్ల కు చాలా ముఖ్యమైంది. సంక్రాంతి సినిమాలకు దాదాపు మూడు వందల యాభై కోట్ల బిజినెస్ జరుగుతుంది. అందుకే పెద్ద సినిమాలు సంక్రాంతి బరి లో నిలుస్తాయి. సంక్రాంతి పుంజుల్లాగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకదానితో మరొకటి తలపడతాయి. ఈ సంక్రాంతి పోటీ ని ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మిగతా సందర్భాలలో పెద్ద సినిమాలకు మధ్య రెండు వారాల గ్యాప్ ఇస్తున్నారు కాబట్టి ఇలాంటి పోటీని సంక్రాంతి పండుగకు తప్ప మరో సందర్భంలో చూడడం కష్టం.

అయితే ఈ సారి జస్ట్ బాక్స్ ఆఫీస్ పోటీ కాకుండా సంక్రాంతి సినిమాలు ప్రతి విషయంలో పోటీ పెట్టుకుంటూ రిలీజ్ కు ముందే ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ పోటీ ‘సరిలేరు నీకెవ్వరు’.. ‘అల వైకుంఠపురములో’ సినిమాల మధ్య ఉంది. పోస్టర్లు.. లిరికల్ సాంగ్స్.. టీజర్ల విషయంలో ఇప్పటికే భారీ పోటీ కొనసాగుతోంది. ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడేమో రిలీజ్ డేట్ విషయంలో క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆడుతూ పరోక్షంగా బయ్యర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నారు.

అయితే ఈ ఎపిసోడ్ లో మొదటి నుంచి మహేష్.. అల్లు అర్జున్ పేరు బయటకు వస్తోంది కానీ గురూజీ త్రివిక్రమ్ పేరు మాత్రం అసలు వినిపించడం లేదు. హారిక హాసిని వారు త్రివిక్రమ్ చెప్తే వింటారనేది అందరికీ తెలిసిందే. అయితే త్రివిక్రమ్ ఈ విషయంలో కలుగజేసుకోవడం లేదని అంటున్నారు. గురూజీకి మహేష్ తో కూడా సాన్నిహిత్యం ఉంది. గతంలో మహేష్ రిక్వెస్ట్ పై ‘అ ఆ’ రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసుకున్నాడని కూడా ఇండస్ట్రీలో టాక్ ఉంది.

ఇటు బన్నీతో కూడా ఆయనకు మంచి సాన్నిహిత్యమే ఉంది.. మరి రెండు వైపులా హీరోలు సన్నిహితులు అయి ఉండి కూడా త్రివిక్రమ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారనే ప్రశ్నను కొంతమంది లేవనెత్తుతున్నారు. ఈ అనవసర పోటీ వల్ల రెండు సినిమాలకు నష్టం జరుగుతుందని తెలిసినా ఆయన ఎందుకు ఊరుకుంటున్నారు? దీంతో మహేష్ కు త్రివిక్రమ్ కు ఏమనా చెడిందా అనే కొత్త అనుమానాలు కూడా వస్తున్నాయి.
Please Read Disclaimer