ఐపీఎల్ గర్ల్: ఎవరీ ‘సూపర్ ఓవర్’ బ్యూటీ ?

0

గత ఆదివారం ముంబై పంజాబ్ ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే ఒక వండర్. ఊపిరి బిగబట్టి అందరూ ఉత్కంఠభరితంగా చూసిన ఈ మ్యాచ్ లో ఏకంగా మ్యాచ్ టై అయ్యి.. రెండు సూపర్ ఓవర్లు జరిగి విజేతగా చివరకు పంజాబ్ గెలిచింది.

పంజాబ్ లక్ష్య చేధనలో చివరి వరకు పోరాడి గెలిచింది. ఈ చివరి ఓవర్ లో పంజాబ్ డకౌట్ లో ఓ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. స్టేడియంలో మ్యాచ్ చూస్తూ టెన్షన్ తో గోళ్లు కొరుకుతున్న ఆమెను అప్పుడు మ్యాచ్ సందర్భంగా చూపించారు. దీంతో ఇంటర్నెట్ లో వైరల్ అయిపోయింది. టీవీ స్క్రీన్ పై కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఎవరా అని అందరూ ఆరాతీయడం మొదలుపెట్టారు.

ఎట్టకేలకు ఆమె ఆచూకీ తెలిసింది. ఆమె పేరు రియానా లాల్వాణి. ఆమె ఎవరు ఎక్కడ ఉంటుందనే వివరాలు తెలియరాలేదు. ఈమె స్టేడియంలో చూస్తుందంటే ఖచ్చితంగా ముంబై లేదా పంజాబ్ ఫ్రాంచైజీ లో ఏదో ఒక జట్టుకు చెందిన అమ్మాయి అని తెలుస్తోంది.

ఆమె ఐపీఎల్ మ్యాచ్ లో కనిపించగానే ఇన్ స్టాగ్రామ్ కేవలం 11 పోస్టులు పెట్టిన ఆమెకు సడన్ గా 61వేల మంది అభిమానులు అయ్యారు. అంతేకాదు.. రియానా ఫ్యాన్స్ క్లబ్ పేరిట ఇప్పుడు సోషల్ మీడియాలోనూ పేజీలు పుట్టుకొచ్చాయి.